Begin typing your search above and press return to search.
కూకట్ పల్లి కాదు.. ఖమ్మం నుంచే పోటీ అంటున్న మంత్రి
By: Tupaki Desk | 17 Jan 2023 1:30 PM GMTఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయం భలే రంజుగా ఉంటుంది. ఇప్పుడనే కాదు.. కొన్ని దశాబ్దాలుగా ఇదే పద్ధతి. ఎక్కడో ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన వ్యక్తిని ఆదరించి.. ఉమ్మడి రాష్ట్ర సీఎం స్థాయికి చేర్చింది ఉమ్మడి ఖమ్మం జిల్లా. ఇతర జిల్లాల నుంచి వచ్చిన నాయకులను ఆదరించి ఎంపీలుగానూ గెలిపించింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉమ్మడి జిల్లాలో కొన్ని ప్రాంతాలకే ఆ ప్రభావం పరిమితమైంది. ఇక తెలంగాణ/ఏర్పాటయ్యాక మాత్రం పూర్తి స్థాయిలో తెలంగాణదనంతో ముందుకెళ్తోంది. రాజకీయంగా చూస్తే ఉమ్మడి ఖమ్మంలో ఉన్నది మూడే జనరల్ సీట్లు. మొత్తం 10 అసెంబ్లీ సీట్లకు గాను పాలేరు, ఖమ్మం, కొత్తగూడెం మాత్రం జనరల్. రెండు ఎంపీ స్థానాల్లో భ్రదాచలం పునర్ విభజనలో రద్దయింది. మహబూబాబాద్ లో భాగమైంది. ఖమ్మం ఎంపీ సీటు జనరల్ గానే ఉంది.
స్థానాలు తక్కువ.. నాయకులు ఎక్కువ ఏడు రిజర్వ్ డ్ సీట్లు పోగా జనరల్ వర్గానికి చెందిన ఏ నాయకుడైనా మూడు స్థానాల నుంచే పోటీ చేయాలి. లేదంటే ఎంపీగా వెళ్లాలి. అయితే, ఉమ్మడి ఖమ్మంలో నాయకులు ఎక్కువ. జనరల్ స్థానాలు తక్కువ అన్నట్లుగా ఉంది ప్రస్తుత పరిస్థితి. మొదటినుచే పోటీ ఎక్కువ అనుకుంటే కొత్త తరం రాకతో 2009 తర్వాత మరింత అధికమైంది. అంతకుముందు కాంగ్రెస్, టీడీపీలో సాగిన వర్గపోరు ఇప్పుడు అధికార పార్టీకీ తగిలింది.
దీనిని సర్దిపుచ్చలేక నాలుగేళ్లుగా నానబెట్టిన బీఆర్ఎస్ అధిష్ఠానం తాజా పరిణామాల్లో ఒక నిర్ణయానికి వచ్చేసింది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీని వీడడం ఖాయమని తేలిపోవడమే దీనికి కారణం. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పెద్ద దిక్కుగా మారారు. ఈయన పాలేరు నుంచి పోయినసారి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు.
ఖమ్మం కాదు కూకట్ పల్లి అని ప్రచారం చేసిందెవరు?ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2018లో బీఆర్ఎస్ గెలిచింది ఒకే ఒక్క సీటు. ఖమ్మం జిల్లా కేంద్రం ఖమ్మంలో పువ్వాడ అజయ్ కుమార్ మంత్రిగా గెలుపొందారు. దీంతో ఆయనకే మంత్రివర్గంలో స్థానం దక్కింది. ఎన్నికల్లో ఒకే ఒక్క సీటుకు పరిమితమైన తదనంతర పరిణామాల్లో తమ్మల, పొంగులేటి ప్రాధాన్యం తగ్గి పువ్వాడకు పెరిగింది. పైగా ఆయన కేటీఆర్ కు సన్నిహితులనే ప్రచారం ఉంది. దీంతో కీలకమైన రవాణా శాఖ దక్కింది.
ఇక ఇప్పుడు తుమ్మల రాజకీయంగా క్రియాశీలం కావడం, బీఆర్ఎస్ ఏర్పాటు రీత్యా ఉమ్మడి జిల్లాను శాసించే నాయకత్వం అవసరం కావడంతో పువ్వాడతో సమ ప్రాధాన్యం తుమ్మలకు దక్కనుంది. ఈ నేపథ్యంలో ఎలా వచ్చిందో కానీ.. పువ్వాడ నియోజకవర్గం మారతారని, వచ్చే ఎన్నికల్లో కూకట్ పల్లి నుంచి పోటీ చేస్తారని ప్రచారం మొదలై సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అక్కడే ఎందుకు..హైదరాబాద్ కూకట్ పల్లి నియోజకవర్గం సెటిలర్ల దుర్గం. ఇక్కడనుంచి అత్యధిక సంఖ్యలో ఓటర్లు సీమాంధ్రకు చెందినవారు. లోక్ సత్తా అధినేత జేపీ సైతం ఇక్కడినుంచే గెలిచారు. ముఖ్యంగా కూకట్ పల్లిలో ఖమ్మం సామాజిక వర్గం ఓట్లు అధికం. దీంతోనే పువ్వాడకు స్థానం చలనం.. ఖమ్మం కాదు కూకట్ పల్లి నుంచి పోటీ అంటూ కథనాలు అల్లారు. అయితే, దీనిపై పువ్వాడ ఘాటుగా స్పందించారు. అబద్ధాలు ప్రచారం చేయిస్తున్న వారి నోళ్లు మూయిస్తానంటూ మండిపడ్డారు. అయితే, తుమ్మలకు పూర్వ ప్రాభవం దక్కుతుండడం, ఆయన నియోజకవర్గం పాలేరులో ఇప్పటికే బీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ఉండడం.. తదితర పరిణామాల నేపథ్యంలో మంత్రి స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.