Begin typing your search above and press return to search.

ఛీ..ఛీ.. కరోనా మృతుల బట్టలు కూడ వదలట్లేదు !

By:  Tupaki Desk   |   10 May 2021 9:44 AM GMT
ఛీ..ఛీ.. కరోనా మృతుల బట్టలు కూడ వదలట్లేదు !
X
కరోనా వైరస్ తో ప్రజలు విలవిలాడుతుంటే, మరికొందరు మాత్రం డబ్బు సంపాదనకు కక్కుర్తి పడుతున్నారు. మనిషి చచ్చిపోతున్నా కనీస కరుణ చూపకుండా కొన్నిముఠాలు వ్యవహరిస్తూ,బతికున్నప్పుడే కుక్కల్లా పీక్కుతింటున్నారు. మనిషి బతికి ఉన్నప్పుడు సరే కొన్ని చోట్ల కరోనాతో చచ్చిపోయిన శవాలను కూడ వదలడం లేదు. శవాలపై ఉన్న బంగారం తో పాటుగా బట్టలు కూడ మాయం చేస్తున్న దారుణ సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కరోనా కాలంలో మనుషులకు బాసటగా ఉండాల్సిన వారు. కనీస మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు. కరోనా శవాలతో కూడ వ్యాపారం చేస్తున్నారు. కరోనా మృతుల వద్దకు కనీసం కుటుంబ సభ్యులు దగ్గరికి రాని పరిస్థితి నెలకొంది. ఇలాంటీ పరిస్థితుల్లో కొన్ని ముఠాలు తమకు అవకాశంగా మార్చుకున్నాయి. కరోనా మృతుల పై ఉన్న బంగారం ఇతర వస్తువులు దోచుకుని పోతున్నారు.

బంగారం అంటే విలువైందని భావించవచ్చు కాని యూపీలో అంతకంటే దారుణమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. యూపీలో వేల మంది కరోనా భారిన పడి మృత్యువాత పడుతున్న నేపథ్యంలోనే వారిని ఎక్కడికక్కడే దహనం చేస్తున్న సంఘటనలు కనిపిస్తున్నాయి. దీంతో అక్కడి శ్మశానవాటికల్లో ఒళ్లు గుగుర్పాటుకు లోనయ్యో సంఘటనలు జరుగుతున్నాయి. కొంతమంది దొంగలు శ్మశాన వాటికలకు వచ్చిన శవాలపై ఉన్న బట్టలు దొంగిలిస్తున్నారు. అనంతరం వాటిని ఉతికి మళ్లి విక్రయించడం చేస్తున్నారు. అయితే విషయం బయటపడడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి మొత్తం ఏడుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు.కరోనా మృతదేహాలపై కప్పిన ముసుగులతో సహా, చీరలు, కుర్తాలు, బెడ్‌షీట్లు, ఇతర వస్తువులను ఈ ముఠా చోరీ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇలా వీరి నుంచి మొత్తం 520 బెడ్‌షీట్లు, 127 కుర్తాలు, 52 చీరలు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. అయితే వీరు స్వతహాగా ఇలాంటీ పని చేసేందుకు సహసించడం లేదు. స్థానికంగా ఉండే వ్యాపారులు ఇలాంటి వారితో డీల్‌ కుదుర్చుకుని, వారికి రోజుకు రూ.300 చొప్పున చెల్లించి ఇలాంటి పనులు చేయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.