Begin typing your search above and press return to search.
కరోనా నుంచి బయటపడేదెప్పుడు? ప్రముఖుల మాటలు వింటున్నారా?
By: Tupaki Desk | 2 Aug 2020 6:50 AM GMTఅక్కడెక్కడో దేశం కాని దేశంలో వచ్చిన కరోనా గురించి సింగిల్ కాలం వార్తలు వచ్చినప్పుడు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. వూహాన్ మహానగరం పూర్తిగా లాక్ డౌన్ విధించటం.. నిత్యం రద్దీగా కళకళలాడే ఆ సిటీలో శ్మశాన నిశ్శబ్దం పహరా కాసిన వైనాన్ని మన మీడియా పెద్దగా పట్టించుకోలేదు. జనవరి చివరకు కానీ తీవ్రత తెలీని పరిస్థితి. దీంతో.. అప్పటిదాకా సింగిల్ కాలమ్ లో వచ్చిన వార్తలు డబుల్ కాలమ్ లోకి రావటమే కాదు.. తర్వాతి రోజుల్లో బ్యానర్లుగా మారాయి. ఇప్పుడైతే.. ఆ వార్తలే ప్రముఖుంగా వస్తున్న పరిస్థితి.
రాబోయే రోజుల్లోనూ ఇలాంటి పరిస్థితి తప్పదు. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే.. వచ్చే ఏడాది మార్చి.. ఏప్రిల్ వరకు ఇప్పుడున్న పరిస్థితులే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. కరోనాకు ముందున్న లాంటి పరిస్థితిని ఎప్పటికి వస్తుందని హెల్త్ కేర్ రంగానికి చెందిన ప్రముఖుల్ని కదిలించినా సరిగా చెప్పలేకపోతున్నారు.
ఇలాంటి సమయంలో.. వీలైనంతవరకు కరోనాకు సంబంధించిన అవగాహన పెంచుకోవటంతో పాటు.. ఇలాంటి వేళలో ఎలా పని చేయాలి? మహమ్మారి ముప్పు నుంచి తప్పించుకోవాలి? అవకాశాల్ని అందిపుచ్చుకోవాలి? లాంటి వాటిని చూసుకుంటూనే.. నిత్యజీవితంలో ఎదురయ్యే పరిస్థితుల్లో ఎలా రియాక్టు కావాలన్నది చాలా ముఖ్యం. మొన్నటికి మొన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ మాట్లాడుతూ.. కరోనా ప్రభావం మరో పదేళ్లు తప్పదని తేల్చేశారు. ఆయన అంచనాలు తప్పు కాదన్న విషయం ఇటీవల కొందరు ప్రముఖులు చెబుతున్న మాటల్ని వింటే అర్థం కాక మానదు.
తాజాగా శాంతా బయోటెక్నిక్స్ ఛైర్మన్ డాక్టర్ వరప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జనవరిలో కోవిడ్ మన దేశంలో వెలుగుచూస్తే.. ఇప్పటివరకూ అందుకు అవసరమయ్యే మందుల్ని కనుగొనేందుకు అవసరమైన సీఎస్సార్ ల్యాబులను సిద్ధం చేసుకోలేదన్న మాటను వింటే.. పరిస్థితి ఏమిటో ఇట్టే అర్థం కాక మానదు. ఇప్పుడున్న పరిస్థితులకు కారణం.. ప్రభుత్వాలు వైద్యం.. విద్య విషయాల్లో అనుసరించిన విధానాలేనని చెప్పారు. వాటికి సరైన ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు.
రాబోయే రోజుల్లో జీవరసాయనాలతో యుద్ధాలు చేయాల్సి వస్తుందని అందుకు సిద్ధంగా ఉండాలన్నారు. కోవిడ్ కు విరుగుడు ఇప్పట్లో రాకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. పరిశోధనలు చేయటానికి కనీసం 15 నుంచి 18 నెలలు టైం పడుతుందన్నారు. అత్యవసర పరిస్థితులకు లోబడి.. పలు అంశాల్లో రాజీపడి రూపొందిస్తున్నామని చెబుతున్నారు. ఆయన చెబుతున్న మాటల్ని వింటనే.. వ్యాక్సిన్ అంత తేలిగ్గా వచ్చే అవకావం లేదన్న భావన కలుగక మానదు. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. వ్యాక్సిన్ వెంటనే అయితే వచ్చే అవకాశం లేదన్న అభిప్రాయాన్ని ఒక్కొక్కరుగా వ్యక్తం చేస్తున్న వేళ.. వైరస్ మీద మరింత అవగాహన కల్పించుకోవటం చాలా ముఖ్యం.