Begin typing your search above and press return to search.
పెళ్లిలో మాస్కులు ఎందుకు..మేము ఏం తప్పు చేయలేదు!
By: Tupaki Desk | 18 April 2020 10:10 AM GMTకర్ణాటక మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ-రేవతిల వివాహంపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లాక్ డౌన్ వేళ వివాహ వేడుక ఎందుకు జరిపించారని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా అధికార బీజేపీ నేతలు కుమారస్వామిని తీవ్రంగా తప్పు పడుతున్నారు. రామనగర జిల్లాలో కరోనా వ్యాప్తి చెందితే దానికి కుమారస్వామి కుటుంబమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
అయితే కుమారస్వామి మాత్రం పెళ్లిని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా జాతీయ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ నిజంగా తాము తప్పు చేసి ఉంటే.. తమపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎంకు కుమారస్వామి సవాల్ విసిరారు. జిల్లా మెజిస్ట్రేట్ అనుమతితోనే వివాహం జరిపించామని తెలిపారు. వివాహ వేడుకకు వచ్చిన ప్రతీ కారుకు అధికారులు ఇచ్చిన పాసులు ఉన్నాయన్నారు. ఇక మాస్కులు ధరించలేదని విమర్శించడాన్ని ఆయన తప్పు పట్టారు. ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిందని అయన తెలిపారు.
ఈ వివాహ వేడుక పై రాద్దాంతం చేయడం తనను తీవ్రంగా బాధించిందన్నారు. కేవలం రక్త సంబంధీకులు మాత్రమే వివాహానికి హాజరయ్యారని స్పష్టం చేశారు. సోషల్ డిస్టెన్స్ పాటించట్లేదని తనను నిందించేవాళ్లను కుమారస్వామి ఎదురు ప్రశ్నించారు. ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్ వద్ద వేలాది మంది వలస కార్మికులు గుమిగూడిన ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. అలాగే అన్ని బాగుంటే అభిమానుల సమక్షంలో అంగరంగ వైభవంగా ఈ పెళ్లిని జరిపించాలని అనుకున్న అని , కానీ కరోనా తో అది కుదరలేదు అని , అభిమానులు క్షమించాలని కోరారు. అయితే లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారంటూ కుమారస్వామి కుటుంబంపై ఆరోపణలు వస్తున్నాయి. కుమారస్వామిపై చర్యలు తీసుకోవాలని కర్ణాటక డిప్యూటీ సీఎం అశ్వథ్ నారాయణ్ రామ నగర్ కమిషనర్ ను కోరారు. దీంతో వివాహ వేడుకపై విచారణ జరుపుతున్నట్టు ఆయన ప్రకటించారు.