Begin typing your search above and press return to search.

స‌చిన్‌ తో 18 నెల‌లుగా మాట‌ల్లేవ్‌: రాజ‌స్థాన్‌ సీఎం వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   19 July 2020 8:45 AM GMT
స‌చిన్‌ తో 18 నెల‌లుగా మాట‌ల్లేవ్‌: రాజ‌స్థాన్‌ సీఎం వ్యాఖ్య‌లు
X
రాజస్థాన్ రాష్ట్రంలో ఏర్ప‌డిన ప్ర‌భుత్వ సంక్షోభం ఇప్ప‌ట్లో ముగిసేట‌ట్టు లేదు. తిరుగుబాటుదారుడు స‌చిన్‌ పైలట్ వ‌ర్గంపై కాంగ్రెస్ నాయ‌కులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. వీరి మ‌ధ్య‌లో బీజేపీ ప్ర‌వేశంతో ర‌స‌వ‌త్త‌రంగా మారింది. అయితే స‌చిన్ పైలెట్ విష‌య‌మై తాజాగా ముఖ్య‌మంత్రి అశోక్ గ‌‌హ్లోత్ స్పందించారు. స‌చిన్ పైల‌ట్‌తో తనకు మ‌ధ్య 18 నెలలుగా మాటలు లేవని సంచలన విషయం చెప్పారు. తన ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు పైలట్‌ మొదటి రోజు నుంచే ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బీజేపీలో చేరడం లేదని చెబుతున్న పైలట్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి తిరిగి వస్తే ఆలింగనంతో ఆహ్వానిస్తానని గహ్లోత్ తెలిపారు. ఈ విష‌యాలు ఓ టీవీ చాన‌ల్‌ తో అశోక్ గ‌హ్లోత్ పంచుకున్నారు.

‘ఏడాదిన్నర నుంచి మేం ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదు. ముఖ్యమంత్రితో మాట్లాడని మంత్రి అతడు’అని గ‌హ్లోత్ పేర్కొన్నారు. ‘నేను మొదటిసారి ఎంపీ అయినప్పటికి అతడి వయసు మూడేళ్లు. దశాబ్దాలుగా అతడి కుటుంబంతో నాకు సంబంధాలు కొనసాగుతున్నాయి. మళ్లీ పార్టీలోకి వస్తే అతడిని మనస్ఫూర్తిగా ఆలింగనం చేసుకుని ఆహ్వానిస్తా’అని ప్ర‌క‌టించారు.

ప్ర‌భుత్వంలో సంక్షోభం ఏర్ప‌డిన ప్ర‌భుత్వానికి వ‌చ్చిన న‌ష్ట‌మేమి లేదు. గ‌హ్లోత్‌ ప్రభుత్వానికి మ‌ద్ద‌తు చాలా మంది ఇస్తున్నారు. తాజాగా తమ మద్దతు గ‌హ్లోత్‌ కేన‌ని భారతీయ ట్రైబల్‌ పార్టీ (బీటీపీ) తెలిపింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు - పీసీసీ అధ్యక్షుడు ప్రకటించారు. అయితే శ‌నివారం సాయంత్రం సీఎం అశోక్‌ గహ్లోత్‌ గవర్నర్‌ కల్‌ రాజ్‌ మిశ్రాతో స‌మావేశ‌మ‌య్యారు. దాదాపు 45 నిమిషాల పాటు కొనసాగిన భేటీలో వైర‌స్ వ్యాప్తి‌పై చర్చించినట్లు సీఎం గ‌హ్లోత్ తెలిపారు.