Begin typing your search above and press return to search.

టీమిండియా సత్తా ఏంటో? చెప్పిన లక్ష్మణ్​..!

By:  Tupaki Desk   |   26 May 2021 9:30 AM GMT
టీమిండియా సత్తా ఏంటో? చెప్పిన లక్ష్మణ్​..!
X
ప్రస్తుతం టీమిండియా తరఫున కోహ్లీసేన ఇంగ్లండ్​ పర్యటనకు వెళ్తుండగా.. మరో జట్టు శ్రీలంక టూర్​కు వెళ్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో కొందరు సెటైర్లు వేస్తున్నారు. టీమిండియా ఏక కాలంలో రెండు టీమ్​ లను పంపించడం సరైన చర్యేనా అంటూ కామెంట్లు పెడుతున్నారు. పటిష్ఠమైన ఒక జట్టును పంపించవచ్చు కదా? అనేది వాళ్ల భావన కావచ్చు. ఇదిలా ఉంటే కోహ్లీ సేన ఇంగ్లండ్​ వెళ్తుండగా.. లంక టూర్​ కు వెళ్లే జట్టు కూడా ఖరారైంది. కానీ ఈ జట్టుకు కెప్టెన్​ ఎవరు? అనేది ఇంకా తేలలేదు. కానీ శ్రీలంక వెళ్లబోయే జట్టుకు రాహుల్​ ద్రవిడ్​ హెడ్​కోచ్​ గా వ్యవహరించబోతున్నారు.

ఈ క్రమంలో ఈ విషయంపై టీమిండియా మాజీ ఆటగాడు, హైదరాబాద్​ కు చెందిన వీవీఎస్​ లక్ష్మణ్​ స్పందించారు. టీమిండియా ఒకేసారి రెండు జట్లు కాదు.. మూడు జట్లు కూడా పంపించగలదంటూ లక్ష్మణ్​ అన్నాడు. టీమిండియా కు అంత సత్తా ఉంది అని చెప్పాడు. అంతేకాక ఇక్కడ ఎందరో యువ ఆటగాళ్లు ఉన్నారని.. యువ ఆటగాళ్లకు టీమిండియా ఫ్యాక్టరీగా మారిందని వ్యాఖ్యనించాడు. అంతేకాక ఐపీఎల్​ ద్వారా ప్రతి ఏడాది ఎంతోమంది యువ ఆటగాళ్లు తెరమీదకు వస్తున్నారని చెప్పారు.

ఇటీవల లక్ష్మణ్​ ఓ దినపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చాడు . ఈ సందర్భంగా మాట్లాడుతూ..భారత దేశవాళి క్రికెటర్లు ఎంతో పటిష్ఠంగా ఉన్నారు. అందుకు కారణం బీసీసీఐ చైర్మన్​ గంగూలీ, రాహుల్​ ద్రవిడ్​.. వారి నిర్ణయాలు ఎంతో ఉపకరించాయి.ప్రస్తుతం జూనియర్​ జట్టుకు రాహుల్ ద్రవిడ్​ను కోచ్​ గా ఎంపికచేయడం ఎంతో గొప్ప విషయం . ఇది సరైన నిర్ణయం కూడా. మరోవైపు టీమిండియా హెడ్​కోచ్​ రవిశాస్త్రి ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నాడు. కాబట్టి.. ద్రవిడ్ ఎంపిక ఎంతో ఉపయోగపడుతుంది.

వరల్డ్​ టెస్ట్​ చాంపియన్​ షిప్​ లో భారత్​యే ఫేవరెట్​ జట్టు. ఎందుకంటే విదేశీ గడ్డపై మనవాళ్లు అదరగొడుతున్నారు. గత కొన్నేళ్లుగా వాళ్ల రికార్డులను పరిశీలిస్తే ఈ విషయం అర్థమైపోతుంది.

అంతేకాక ఇటీవల ఆస్ట్రేలియాతో టూర్​ లో.. సీనియర్లు ఎవరూ లేకపోయినా.. యువక్రికెటర్లే సత్తా చాటారు. అయితే బౌలింగ్ పరంగా కీవిస్​ ఎంతో స్ట్రాంగ్ గా ఉంది. ఈ విషయాన్ని మనవాళ్లు అర్థం చేసుకోవాలి. అందుకనుగుణంగా ప్లాన్​ చేసుకుంటే సరిపోతుంది. ఓ వైపు టీమిండియా రెండు టీమ్​లతో రంగంలోకి దిగుతుండటంతో విమర్శలు వస్తుండటంతో లక్ష్మణ్​ బీసీసీఐ కి మద్దతుగా మాట్లాడటం గమనార్హం.