Begin typing your search above and press return to search.

ఖండాలు ఏడు కాదు ఎనిమిది..!

By:  Tupaki Desk   |   13 March 2021 12:30 PM GMT
ఖండాలు ఏడు కాదు ఎనిమిది..!
X
ఈ భూమి మీద ఏడుఖండాలు ఉన్నాయని ఇప్పటివరకు మనమంతా చదువుకున్నాం.. కానీ ఖండాలు ఏడు కాదు ఎనిమిది అని ఇప్పుడో పరిశోధన తేల్చిచెప్పింది. భూమి స్వరూపం.. దాని మీద ఉన్న ఖండాలమీద ఇప్పటికీ పరిశోధనలు సాగుతున్న విషయం తెలిసిందే. భూమి పరిణామం, ఖండాల ఏర్పాటు, వాతావరణం.. వంటి అంశాలపై కొందరు శాస్త్రవేత్తలు ఇప్పటికీ పరిశోధనలు సాగిస్తున్నారు. అయితే డచ్​కు చెందిన అబెల్​ తస్మాన్​ అనే అన్వేషకుడు దక్షిణార్థ గోళంలో ఓ పెద్ద భూభాగం ఉందని నమ్మేవారు. 1642లో ఆయన ఈ దిశగా అనేక పరిశోధనలు చేశారు. కానీ దాని పరిధిని మాత్రం గుర్తించలేకపోయాడు. ప్రస్తుతం శాస్త్రవేత్తలు గుర్తించిన ప్రకారం.. ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, ఆస్ట్రేలియా అనే ఖండాలు ఉన్నాయి.

న్యూజిలాండ్ చుట్టూ ఉన్న ఆ పెద్ద భూభాగాన్ని 1995లో అమెరికన్ జియో ఫిజిస్ట్ బ్రూస్ లుయండిక్ ఓ ఖండంగా గుర్తించారు. దానికి జీలాండియా అనే పేరుపెట్టారు. అయితే గతంలో డచ్​ పరిశోధకుడు అబెల్​ కూడా ఇదే విషయాన్ని వెల్లడించాడు. అయితే ఆ ప్రాంతం కొంతకాలానికి సముద్రంలో మునిగిపోయింది. కాగా 375 సంవత్సరాల తర్వాత ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని గుర్తించారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ అమెరికా (GSA) శాటిలైట్ కెమెరాల ద్వారా ఈ భూభాగంపై పరిశోధనలు చేసింది.

కొన్ని వందల సంవత్సరాల క్రితం అక్కడ పెద్ద భూభాగం ఉండేదని సంస్థ పరిశోధకులు కనుగొన్నారు. అది విస్తీర్ణంలో ఆస్ట్రేలియా అంత విస్తీర్ణం ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. జీలాండియా అనేది నీటిలో దాగి ఉన్న ఖండమని GSA పేర్కొంది. అయితే ఈ ప్రాంతాలన్ని అసలు ఖండం అని పిలవొచ్చా అన్న విషయంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు శాస్త్రవేత్తలు దీన్ని కొట్టిపారేస్తున్నారు. సముద్రంలో మునిగిపోయిన ఓ ప్రాంతాన్ని ఖండంగా పరిగణించలేమని వాళ్లు అంటున్నారు. అయితే ఈ విషయంపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని చెబుతున్నారు.