Begin typing your search above and press return to search.
మూడు కాదు రెండు రాజధానులు చాలంట
By: Tupaki Desk | 13 Feb 2022 3:30 AM GMTఏపీకి ఏదీ రాజధాని అంటే చెప్పలేని పరిస్థితి ఒక వైపు ఉంది. నాలుగవ తరగతి పాఠ్యపుస్తకంలో ఇండియన్ మాప్ లో అన్ని రాష్ట్రాలకు రాజధాని ఉంది కానీ ఒక్క ఏపీకి మాత్రం లేదు. ఇదీ ప్రెజెంట్ సిట్యువేషన్. ఇదిలా ఉంటే ఏపీలో మూడు రాజధానుల రగడ అలా సాగుతూనే ఉంది. ఏపీకి తప్పకుండా మూడు రాజధానులు వస్తాయని మంత్రి కొడాలి నాని బల్ల గుద్ది మరీ చెబుతున్నారు.
విపక్షాలు ఒప్పుకోకపోయినా తాము ప్రజల కోసం మూడు రాజధానులు తీసుకువస్తామని అంటున్నారు. ఈ విషయంలో రెండవ మాటకు తావు లేదని కూడా వైసీపీ మంత్రి జబర్దస్త్ గా చెప్పేశారు. సరే నాని లాంటి మంత్రులు ఎపుడూ ఇలాగే చెబుతున్నారు. ఇక ప్రభుత్వం అయితే ఏం చేస్తుందో అన్న ఆసక్తి ఎటూ ఉంది.
ఈ మధ్యలో కేంద్ర మంత్రి రామ్ దాస్ అథవాలే కూడా ఏపీ రాజధానుల మీద తనదైన స్టైల్ లో హాట్ కామెంట్స్ చేశారు. విజయవాడ టూర్లో మీడియాతో మాట్లాడిన రామ్ దాస్ ముందు ఒక్క రాజధాని అమరావతి అభివృద్ధికే ఇబ్బందులు పడుతున్నారు మూడు రాజధానులు అవసరమా అన్నట్లుగా కేంద్ర మంత్రి మాట్లాడారు.
ఆ మీదట మూడు రాజధానులు కంటే రెండు రాజధానులు పెట్టుకుంటే మంచిదేమో అని తనదైన సలహా లాంటి మాట ఒకటి చెప్పారు. ఏపీ ఆర్ధికంగా ఇబ్బందులో ఉందని, తాను కేంద్రంతో మాట్లాడి ఏపీని ఆర్ధికంగా ఆదుకోమని చెబుతాను అని కూడా అన్నారు.
అదే విధంగా జగన్ని కేంద్ర ప్రభుత్వంలో చేరమని ఎపుడూ అనే మాట కూడా రామ్దాస్ అన్నారు. జగన్ సీఎం కావడం చంద్రబాబు రాజకీయ జీవితానికి అతి పెద్ద దెబ్బగా ఆయన అభివర్ణించారు. ఏపీలో జగన్ పాలన బాగుందని కితాబు ఇచ్చారు. ఇవన్నీ పక్కన పెడితే కేంద్ర మంత్రి రెండు రాజధానులు బెటర్ అని కొత్త నినాదం ఇచ్చారు. మొత్తానికి చూస్తే ఏపీకి ఒకటా రెండా మూడా ఎన్ని రాజధానులు, అసలు ఇంతకీ ఏపీకి రాజధాని ఒకటైనా ఉందా అన్నదే మిలియన్ డాలర్ ప్రశ్నగా ఉంది మరి.