Begin typing your search above and press return to search.

స‌ర్కారుతో చ‌ర్చ‌కు నై! తేల్చి చెప్పిన ఉద్యోగ సంఘాలు

By:  Tupaki Desk   |   25 Jan 2022 10:32 AM GMT
స‌ర్కారుతో చ‌ర్చ‌కు నై!  తేల్చి చెప్పిన ఉద్యోగ సంఘాలు
X
ఏపీ ప్ర‌భుత్వానికి, ఉద్యోగ సంఘాల‌కు మ‌ధ్య ఏర్ప‌డిన వివాదం ఇప్ప‌ట్లో స‌మ‌సిపోయేలా క‌నిపించ‌డం లేదు. పీఆర్సీ ప్ర‌కారం త‌మ వేత‌నాలుత‌గ్గుతాయ‌ని.. ఉద్యోగులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే.. ప్ర‌బుత్వం మాత్రం దీనిని ఎట్టి ప‌రిస్థితిలోనూ స‌వ‌రించేది లేద‌ని.. చెబుతోంది. ఈ క్ర‌మంలో ఉద్యోగ సంఘాల‌తో చ‌ర్చించేందుకు.. బుజ్జ‌గింపుల క‌మిటీని ఏర్పాటు చేసింది. ఈ క‌మిటీని అధికారికంగానే ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం మంత్రులు, సీఎస్‌, స‌ల‌హాదారు స‌జ్జ‌ల‌కు దీనిలో చోటు క‌ల్పించింది.

ఇప్ప‌టికే సోమ‌వారం ఈ క‌మిటీ చ‌ర్చ‌ల‌కు రావాలంటూ.. ఉద్యోగుల‌ను ఆహ్వానించింది. అయిన‌ప్ప‌టికీ వారు రాలేదు. దీంతో మంగ‌ళ‌వారం అయినా.. చ‌ర్చ‌ల‌కురావాల‌ని..క‌మిటీలో ఉన్న మంత్రులు బొత్స‌స‌త్య‌నారాయ‌ణ‌, బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి, స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డి కోరారు. అయితే.. ఉద్యోగులు మాత్రం ప్రభుత్వంతో చర్చలకు వెళ్లకూడదని పీఆర్సీ సాధన సమితిగా ఏర్ప‌డిన ఉద్యోగ సంఘాల నాయ‌కులు నిర్ణయించారు. ఇప్ప‌టికే ఇచ్చిన పీఆర్సీ జీవోలు రద్దు చేసే వరకు చర్చలకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేర‌కు విజయవాడ ఎన్జీవో హోంలో పీఆర్సీ సాధన సమితి నేతలు భేటీ అయి మంత్రుల కమిటీ ఆహ్వానంపై చర్చలకు వెళ్లాలా లేదా అన్న అంశంపై స్టీరింగ్ కమిటీ నేతలు చర్చించారు. ఉద్యోగ సంఘా ల అభిప్రాయాలను చర్చలకు వచ్చి చెప్పొచ్చు కదా అని ప్రభుత్వం పదే పదే చేస్తున్న విజ్ఞప్తులపై నేతలు సమాలోచనలు జరిపారు. జీవోలు రద్దు చేయాలని మంత్రుల కమిటీకి లేఖ రాయాలని భేటీలో సాధన సమితి నేతలు నిర్ణయించారు. మ‌రోవైపు ఉద్యోగ సంఘాలతో చర్చించడానికి మంత్రుల కమిటీ సచివాలయానికి చేరుకుంది. మంత్రులు బుగ్గన, పేర్నినాని, సజ్జల, అధికారులు ఉద్యోగ సంఘాల నేతలు చర్చలకు వస్తారని నిరీక్షిస్తున్నారు.

అయితే.. ఉద్యోగ సంఘాల కీల‌క నేత‌లు కాకుండా.. ఒక 9మందితో ప్ర‌తినిధి బృందాన్ని పంపాల‌ని.. ఉద్యోగ సంఘాల స్టీరింగ్ కమిటీ నిర్ణ‌యించింది. అంటే.. రేపు ప్ర‌బుత్వం.. త‌మ‌పై ఎదురు దాడి చేసే అవ‌కాశం ఉంద‌ని.. ఉద్యోగులు భావిస్త‌తున్నారు. మేం చ‌ర్చ‌ల‌కు ర‌మ్మ‌న్నా కూడా రాలేద‌నే మాట వ‌స్తుంద‌ని.. భావించిన ఉద్యోగులు.. 9 మందితో ఒక క‌మిటీని ఏర్పాటు చేసి.. ఈ క‌మిటీని తొలుత మంత్రి బృందం వద్దకు పంప‌నున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.