Begin typing your search above and press return to search.
మాస్కు పెట్టుకోలేదా? దిమ్మ తిరిగేలా అక్కడికక్కడ షాకిచ్చే శిక్ష
By: Tupaki Desk | 11 July 2020 8:10 AM GMTఎవరికి వారు చిన్న.. చిన్న జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ ముప్పు నుంచి తప్పించుకునే వీలున్నప్పటికీ.. నిర్లక్ష్యంతో వ్యవహరిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న వారెందరో. ప్రభుత్వాలు ఎంతలా ప్రచారం చేస్తున్నా.. వాటిని పాటిస్తున్న వారి సంఖ్య తక్కువే. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారి విషయంలో కొన్ని రాష్ట్రాల పోలీసులు వినూత్నంగా శిక్షలు విధిస్తున్న వైనం తెలిసిందే.
తాజాగా అలా వ్యవహరిస్తూ అందరిని ఆకర్షిస్తున్నారు పశ్చిమబెంగాల్ పోలీసులు. ఆ రాష్ట్రానికి చెందిన సిలిగురి మెట్రోపాలిటన్ పోలీసులు మాస్కులు లేకుండా వీధుల్లోకి వచ్చే వారి విషయంలో వ్యవహరిస్తున్న తీరు అందరిని ఆలోచనలో పడేయటమే కాదు.. తప్పనిసరిగా రూల్ ను పాటించేలా మార్పు తీసుకురావటం గమనార్హం. ఇంతకు వారు చేస్తున్నదేమిటంటే.. మాస్కు పెట్టుకోకుండా రోడ్ల మీదకు వచ్చే వారిని అదుపులోకి తీసుకుంటారు.
వెంటనే.. వారిని రెండు గంటల పాటు రోడ్డు మీదనే నిలుచోబెడతారు. ఇలాంటి శిక్ష వేయటం ద్వారా.. రెండు గంటల పాటు అలానే రోడ్ల మీద ఉండిపోవటం ఇబ్బందికరంగా మారుతుంది. అంతేకాదు.. వెళ్లాల్సిన పనులు.. ఆఫీసులకు వెళ్లాల్సిన వారు.. ఇతర అవసరాల కోసం వెళ్లే వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతారు. తాము చేసే తప్పులకు అప్పటికప్పుడు శిక్షలు అనుభవించాల్సి రావటంతో.. అక్కడి ప్రజల తీరులో మార్పు వచ్చినట్లు చెబుతున్నారు. మరి.. ఇలాంటి వినూత్నమైన శిక్షలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అమలు చేస్తే బాగుంటుందన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది.