Begin typing your search above and press return to search.
వైసీపీని నోటా - కేఏ పాల్ గుర్తులు దెబ్బతీశాయా?
By: Tupaki Desk | 13 April 2019 4:12 AM GMTఏపీ ఎన్నికలు ఇంతవరకు రాజకీయ పార్టీలకే కాక రేపాయి.. ఇప్పుడు ప్రజల్లోనూ అవి కాక పుట్టిస్తున్నాయి. ఎవరు గెలవబోతున్నారో స్పష్టంగా అంచనా వేయలేక విశ్లేషకులు కూడా బ్యాలన్స్ గా మాట్లాడుతున్నారు. టీడీపీ - వైసీపీలకు మద్దతుగా ఉన్న వారు మాత్రమే తమ తమ పార్టీలు గెలుస్తాయని చెప్పుకొస్తున్నారు. మిగతా అంతా విజయం ఎవరిదన్నది కచ్చితంగా అంచనా వేయలేకపోతున్నారు.
మరోవైపు కేఏ పాల్ - నోటాల కారణంగా వైసీపీకి కొంత నష్టం జరిగిందని ఎన్నికల విధులకు వెళ్లిన ఉద్యోగుల నుంచి తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధుల్లో చాలామంది వైసీపీకి ఓటు వేయాలనుకున్నా దృష్టిలోపాల కారణంగా - గుర్తుల్లో సామీప్యత కారణంగా పొరపాట్లు చేశారని చెబుతున్నారు.
ప్రధానంగా కేఏ పాల్ కు చెందిన ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులున్న చోట కొంత వైసీపీకి నష్టం కలిగిందని వినిపిస్తోంది. ప్రజాశాంతి పార్టీ గుర్తు హెలికాఫ్టర్ కావడం - దానిపైనా ఫ్యాన్ రెక్కలు ఉండడంతో వృద్ధులు కన్ఫ్యూజైనట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ప్రజాశాంతి పార్టీ అభ్యర్థుల పేర్లు చాలా నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థుల పేర్లతో పోలి ఉన్నాయని.. అది కూడా ప్రభావం చూపనుందని తెలుస్తోంది.
అలాగే.. నోటా కూడా నష్టపెట్టే అవకాశముందంటున్నారు. ఈవీఎంలపై ఉండే నోటా గుర్తు(ఇంటూ గుర్తు) చూసి కూడా చాలామంది వృద్ధులు పొరపడినట్లు తెలుస్తోంది. ఆ గుర్తు కూడా నాలుగు రెక్కల ఫ్యానులా ఉండడంతో దృష్టిలోపాలు ఉన్నవారు.. వృద్ధులు అది కూడా వైసీపీ గుర్తుగా భావించి ఓటేసినట్లు చెబుతున్నారు. వీవీప్యాట్లలో వచ్చే రసీదులు కారణంగా ఎన్నికల విధుల్లోని సిబ్బందికి చాలామంది ఇలాంటి అంశాలు గుర్తించారు.
ఇవి తక్కువ శాతమే కావొచ్చని.. పోటీ తీవ్రంగా ఉన్న నియోజకవర్గాల్లో ఇది ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.