Begin typing your search above and press return to search.
కేసీఆరే కాదు, అలాంటోళ్లు చాలామందే ఉన్నారు
By: Tupaki Desk | 16 March 2016 7:05 AM GMTవ్యవసాయం ద్వారా కోట్లాది రూపాయిలు సంపాదించొచ్చని చేతల ద్వారా నిరూపించిన వ్యక్తి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. శాస్త్రీయ పద్ధతిలో వ్యవసాయం చేస్తే కోట్లాది రూపాయిలు సంపాదించటం పెద్ద కష్టం కాదన్న విషయాన్ని రుజువు చేసిన ఆయనపై.. రాజకీయ ప్రత్యర్థులు చాలానే సెటైర్లు వేస్తుంటారు. అయితే.. వ్యవసాయంతో కోట్లాది రూపాయిల్ని సంపాదించటం సాధ్యమే అని పలువురు ప్రశ్నలు వేస్తారు కానీ.. హైదరాబాద్ లో అలాంటి వాళ్లు చాలామందే ఉన్న విషయాన్ని తాజాగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు.
అయితే.. జైట్లీ ఈ వివరాలు చెప్పటం వెనుక కారణం వేరు. వ్యవసాయం ద్వారా తాము కోట్లాది రూపాయిలు ఆర్జిస్తున్నట్లు తమ ఆదాయపన్ను రిటర్న్స్ లో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావించిన జైట్లీ.. 2007-08 నుంచి 2015-16 మధ్య కాలంలో ఉన్న లెక్కల్ని చూస్తే.. అత్యధిక వ్యవసాయ కోటీశ్వరులున్న మెట్రో నగరాలు కొన్ని ఉన్నాయని చెప్పుకొచ్చారు.
దేశంలో ఇలాంటి వాళ్లున్న నగరాల్లో బెంగళూరు తొలి స్థానంలో నిలిచింది. ఈ గార్డెన్ సిటీలో వ్యవసాయం ద్వారా కోట్లకు పడగలెత్తిన వారు 321 మంది ఉండగా.. ఢిల్లీలో 275 మంది.. కోల్ కతాలో 239 మంది.. ముంబయిలో 212 మంది చెన్నైలో 181 మంది ఉంటే.. హైదరాబాద్ లో 162 మంది ఉన్నట్లుగా లెక్కలు వెల్లడించారు. వ్యవసాయం ద్వారా కోట్లు సంపాదించొచ్చని కేసీఆర్ మాత్రమే కాదు.. ఒక్క హైదరాబాద్ సిటీలోనే చాలామంది ఉన్నట్లు జైట్లీ మాటలు స్పష్టం చేశాయి. అయితే.. అలా చెబుతున్న వారంతా నిజంగా వ్యవసాయం చేస్తున్నారా? లేదా? అన్నది చెక్ చేయాల్సిన అవసరం ఉందని ఐటీ అధికారులు భావిస్తున్నట్లు మంత్రి చెబుతున్నారు.