Begin typing your search above and press return to search.
ఆ రెండు సంచలనాలకు రోజు తేడా మాత్రమే
By: Tupaki Desk | 9 Nov 2019 3:30 PM GMTకలలో కూడా ఊహించని రెండు పెద్ద ఘటనలు ఒకే నెలలో చోటు చేసుకోవటం.. అది కూడా రోజు తేడాతో జరగటం ఒక విశేషంగా చెప్పాలి. అనుకోకుండా జరిగిన ఈ ఉదంతాలు మోడీ సర్కారుకు మేలు కలిగించినవి కావటం మరో ఆసక్తికర అంశంగా చెప్పకతప్పదు. మూడేళ్ల క్రితం నవంబరు 8న పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని అనూహ్యంగా తెర మీదకు తెచ్చింది మోడీ సర్కారు.
2016 నవంబరు 8 రాత్రి వేళ.. దేశ ప్రజలంతా తమ రోజును ముగించుకునే హడావుడిలో ఉంటూ.. భోజనాలు చేసేందుకు సమాయుత్తమవుతున్న వేళ.. ఊహించని పిడుగు వేసినట్లుగా.. రూ.వెయ్యి.. రూ.500 నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోడీ నిర్ణయం తీసుకున్నారు. దేశ ప్రజల్ని నేరుగా ఎంత ప్రభావితం చేసిందన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.
ఇది జరిగిన మూడేళ్ల ఒక్క రోజు తర్వాత అంతే సంచలన అంశానికి సంబంధించిన విషయంపై ఈ రోజు సుప్రీంకోర్టు తుది తీర్పును ఇవ్వటం తెలిసిందే. 134 ఏళ్లుగా నానుతున్న ఈ వివాదానికి తాజాగా సుప్రీంకోర్టు పుల్ స్టాప్ పెట్టేలా తీర్పును ఇచ్చింది. తీర్పునకు ముందే అన్ని పక్షాల వారు సుప్రీం ఇచ్చే తీర్పును గౌరవిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే.
దీనికి తగ్గట్లే తీర్పుపై తాము సంతోషంగా లేమని.. రివ్యూ పిటిషన్ వేస్తామని చెప్పిన సున్నీబోర్డు సైతం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవటం చూస్తే.. ఈ ఇష్యూ ఇక్కడితో క్లోజ్ అయినట్లుగా చెప్పాలి. అయోధ్యపై సుప్రీం ఇచ్చిన తీర్పును బీజేపీ వర్గాలు ఆచితూచి అన్నట్లుగా స్పందించటం.. ఇదెవరి గెలుపు కాదు.. ఎవరి ఓటమి కాదంటూ బీజేపీ నేతలు తమ టీవీ చర్చల్లో చెప్పటం ద్వారా ఇష్యూను ఎంత జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
పెద్దనోట్ల రద్దు.. అయోధ్యపై సుప్రీం తీర్పు రెండు ఒకే నెలలో చోటు చేసుకోవటం.. అది కూడా ఒక రోజు తేడాతో (నవంబరు 8, 9 తేదీల్లో) చోటు చేసుకోవటం చూస్తే.. మోడీ పరివారానికి బాగా కలిసి వచ్చే నెలగా నవంబరును చెప్పాలి. ఈ రెండు అంశాల విషయానికి వస్తే.. పెద్దనోట్ల రద్దు నిర్ణయం దేశ ప్రజల మొత్తాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తే.. అయోధ్యపై సుప్రీం తీర్పు ప్రత్యక్షంగా ప్రభావం చేయనప్పటికీ.. యావత్ దేశం ఉత్కంటతో ఎదురుచూసిన పరిస్థితి. అయితే.. ఈ రెండు ఉదంతాలు మోడీ సర్కారు ఇమేజ్ ను శిఖరానికి చేర్చటం చూస్తే.. నవంబరు కమలనాథులకు బాగా కలిసి వస్తుందన్న భావన కలుగకమానదు.