Begin typing your search above and press return to search.
నోట్ల రద్దు ఎపిసోడ్ లో సామాన్యుడే బకరా?
By: Tupaki Desk | 15 Dec 2016 4:28 AM GMTతన నిర్ణయాలతో.. పాలనతో దేశాన్ని ప్రధాని మోడీ ఎంతమేర మారుస్తారన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. పెద్దనోట్ల రద్దు నిర్ణయం యావత్ దేశానికి షాకింగ్ గా మారటమే కాదు.. మొదట్లో అద్భుత నిర్ణయంగా కీర్తిస్తున్న వారు సైతం.. ఇప్పుడు పెదవి విరుస్తున్నారు. పెద్దనోట్లను రద్దు చేసి 37 రోజులు గడుస్తున్నా.. నేటికీ కరెన్సీకష్టాలు తీరని పరిస్థితి. ఏటీఎంల వద్దా.. బ్యాంకుల వద్దా సామాన్యులు బారులు తీరి.. గంటల తరబడి వెయిట్ చేస్తుంటే.. మరోవైపు బడా బాబులకు ఏ మాత్రం కష్టం కలగకుండా.. నోట్ల కట్టలు నేరుగా ఇంటికే వచ్చేస్తున్న దుస్థితి.
నల్ల కుబేరులకు షాకిచ్చే ఉద్దేశంతో పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని మోడీ సర్కారు చెప్పినప్పటికి.. వాస్తవం మాత్రం అందుకు భిన్నంగా ఉండటమే కాదు.. భారీ ఎత్తున అక్రమాలు బయటకు వస్తున్నాయి. పలుకుబడి.. సంపన్నులకు కరెన్సీ కష్టాలు దరి చేయటం లేదన్న విషయం.. అధికారులు జరుపుతున్న సోదాల్లో బయటపడుతున్న నోట్ల కట్టలు అసలు విషయాన్ని ఇట్టే చెప్పేస్తున్నాయి.
సామాన్యుడు రూ.2 వేల కోసం నానా పాట్లు పడుతుంటే.. అందుకు భిన్నంగా బడా బాబులకు మాత్రం కోట్లాది రూపాయిలు ఇళ్ల గుమ్మాలకే చేరిపోతున్నాయి. తమ సర్కారులో అవినీతి అన్నది లేదని చెప్పే మోడీ అండ్ కో.. పెద్ద నోట్ల రద్దు ఎపిసోడ్ లో చోటు చేసుకుంటున్న అక్రమాలకు ఏం సమాధానం చెబుతారన్నది ప్రశ్న. పెద్ద నోట్లను రద్దు చేసేసి.. కొత్త నోట్లను తెర మీదకు తీసుకురావటం ద్వారా.. నల్లధనానికి చెక్ చెప్పేయొచ్చన్న ప్లాన్ ఫ్లాప్ షోగా మారినట్లుగా కనిపిస్తోంది. సామాన్యుడి డబ్బులు బ్యాంకు డిపాజిట్లుగా మారిపోయి.. సొంత డబ్బులు వాడుకోవటానికి కూడా పరిమితుల మధ్య బండి నడిపించేయాల్సి వస్తోంది. మరోవైపు.. పెద్దోళ్లకు మాత్రం అందుకు భిన్నమైన వెసులుబాటు లభిస్తోంది. ఇలాంటి వాటికి చెక్ చెప్పేయటం.. నగదు కొరత లేకుండా చేసే విషయంలో మోడీ సర్కారు అడ్డంగా విఫలమైనట్లు చెప్పక తప్పదు.
సమాజాన్ని మార్చేందుకు జరిగే ప్రతి ప్రయత్నాన్ని స్వాగతిస్తూ.. త్యాగాలు చేస్తున్న సామాన్యుడ్ని.. బడా బాబులు తమకున్న పరపతితో గేలి చేస్తున్న వైనం.. సగటు జీవి గుండె మండేలా చేస్తోంది. తమను ఉద్దరించటానికే మోడీ ఏదో చేస్తున్నాడని.. ఆయనకు అండగా ఉండాలని.. తమను తాము కష్టపెడుతున్న సామాన్యుడికి మోడీ సర్కారు అండగా నిలవటం లేదన్న విమర్శ వినిపిస్తోంది. ఎప్పటిలానే నోట్ల రద్దు ఎపిసోడ్ లో సామాన్యుడే బకరాగా మారాడన్న భావన వ్యక్తమవుతోంది. ఇది రోజురోజుకి పెరుగుతోంది. ఇదేమాత్రం మంచి సంకేతం కాదన్న విషయాన్ని మోడీ అండ్ కో గుర్తిస్తే మంచిది లేకుంటే.. భారీ నష్టం వాటిల్ల తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/