Begin typing your search above and press return to search.
రెండోసారి రవిప్రకాష్ కు నో బెయిల్
By: Tupaki Desk | 22 May 2019 5:30 PM GMTటీవీ9 వివాదంపై తొలిసారి టీవీ9లో వార్త వచ్చింది. రెండో సారి ముందస్తు బెయిలు కోసం రవి ప్రకాష్ వేసుకున్న పిటిషను తిరస్కరిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ టీవీ ప్రసారం చేసింది. ప్రస్తుతం అజ్ఞాతం లో ఉన్న రవి ప్రకాష్ కు టీవీ 9లో ఫోర్జరీకి పాల్పడిన కేసులో పోలీసులు నోటీసులు ఇచ్చారు. అలంద మీడియా రవిప్రకాశ్ - శివాజీ - మూర్తిలపై కేసులు పెట్టగా... మూర్తి మాత్రమే పోలీసు విచారణకు సహకరించారు. శివాజీ - రవిప్రకాశ్ స్పందించలేదు. మూడు నోటీసులు ఇచ్చినా స్పందన లేకపోవడంతో రవిప్రకాశ్ పై లుక్ అవుట్ నోటీసులు జారీఅయ్యాయి.
ఈ నోటీసుతో అలర్ట్ అయిన రవిప్రకాష్ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ దొరకలేదు. మరోసారి బెయిల్ కోసం దరఖాస్తు చేయగా ఈసారి కూడా బెయిల్ దక్కలేదు. విచారణ నుంచి రవికి మినహాయింపు ఇవ్వడానికి కూడా కోర్టు అంగీకరించలేదు. దీంతో రవి ప్రకాష్ కు దారులు మూసుకుపోయాయి.
మరోవైపు రవి ఉద్దేశపూర్వకంగా దాక్కుంటున్నారని, పోలీసులకు దొరక్కుండా తప్పించుకుతిరుగుతున్నారని, సన్నిహితులకు మాత్రం అందబాటులో ఉంటారని పేర్కొన్నారు. వాట్సాప్ కాల్ లో అందరితో మాట్లాడుతున్నారని పోలీసుల విచారణకు మాత్రం రావడం లేదని చెప్పారు. అయితే, పిటిషను వేయడంతో సోషల్ మీడియాలో రవి ప్రకాష్ ఒక వీడియో సందేశం పంపారు. తాను విలువలకు కట్టుబడి ఉన్నానని, ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నానని అందులో ప్రకటించారు. తన తప్పులేదని, అన్నీ తప్పుడు కేసులు మోపారని ఆ వీడియోలో చెప్పారు.