Begin typing your search above and press return to search.
ఏపీ రైతుల పాదయాత్రకు నోటీసులు..కొత్త రచ్చకు తెర తీసిన పోలీసులు?
By: Tupaki Desk | 7 Nov 2021 5:30 AM GMTఏపీ రాజధాని అమరావతి పరిరక్షణ కోసం కొద్ది రోజుల క్రితం మొదలైన రైతుల మహాపాదయాత్రకు అనూహ్యమైన స్పందన రావటం తెలిసిందే. రాజధాని పరిరక్షణ కోసం అమరావతి రైతులు.. మహిళలు పెద్ద సంఖ్యలో పాదయాత్రను మొదలు పెట్టి.. తిరుపతిలో ముగించేలా ప్లాన్ చేశారు. ప్రస్తుతం ఈ మహాపాదయాత్ర ప్రకాశం జిల్లాలో సాగుతోంది. పాదయాత్రకు అనూహ్యమైన స్పందన రావటం.. మొదట్లో పరిమితంగా సాగిన ప్రచారం రోజులు గడుస్తున్న కొద్దీ.. ఇది కాస్తా పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.
తాజాగా పాదయాత్ర నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు ప్రకాశం జిల్లా పోలీసులు. చీరాల డీఎస్పీ పేరుతో ఉన్న నోటీసుల్ని పర్చూరు ఎస్ఐ ఇవ్వటానికి పాదయాత్ర వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా మహాపాదయాత్ర చేస్తున్న రైతులకు.. పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పాదయాత్ర నిబంధనల్ని ఉల్లంఘించినట్లుగా పోలీసులు పేర్కొంటే.. అలాంటిదేమీ లేదని రైతులు మండిపడుతున్నారు.
నోటీసులు ఎందుకు ఇస్తున్నారో తమకు చెబితేనే తీసుకుంటామని చెప్పటంతో.. పరిస్ధితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితి గురించి తెలుసుకున్న డీఎస్పీ శ్రీకాంత్.. ఏఎస్పీ రవిచంద్రలు మహాపాదయాత్ర వద్దకు వచ్చారు.పాదయాత్రకు 157 మందికి మాత్రమే తాము అనుమతి ఇచ్చామని.. పాదయాత్రలో 2500 మందికి పైగా పాల్గొనటం.. లౌడ్ స్పీకర్లను వినియోగించటం.. ట్రాఫిక్ నిబంధనల్ని పాటించకపోవటం.. రాజకీయ వ్యక్తుల ప్రమేయం లాంటి అతిక్రమలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. అందుకే తాము నోటీసులు ఇస్తున్నట్లుగా వారు వివరించారు.
దీనిపై స్పందించిన పాదయాత్ర నిర్వాహకులు శివారెడ్డి.. పోలీసుల తీరును తప్పు పట్టారు. తాము ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని.. ప్రజల నుంచి అనూహ్యమైన మద్దతు లభిస్తోందని.. వారంలో న్యాయపరంగా పోలీసుల నోటీసులకు సమాధానాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న మద్దతుతో ప్రభుత్వం నోటీసులతో తమను భయపెట్టాలని చూస్తుందని.. తాము బెదిరేది లేదని స్పష్టం చేస్తున్నారు.
మహాపాదయాత్ర తిరుమల వరకు సాగటం ఖాయమని స్పష్టం చేస్తున్నారు. పాదయాత్ర లాంటి వాటి విషయంలో అనుమతులు తీసుకునే దానికి.. వాస్తవానికి మధ్య పొంతన ఉందన్నది అందరికి తెలిసిందే. సాంకేతిక అంశాల్ని తీసుకొని రచ్చ చేయటం ద్వారా ప్రభుత్వానికి లేనిపోని ఇబ్బందులు తీసుకురావటం తప్పించి మరింకేమీ లేదంటున్నారు. మహా పాదయాత్ర విషయంలో పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తే మంచిదన్న మాట వినిపిస్తోంది. లేదంటే.. అనవసరమైన తలనొప్పులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.