Begin typing your search above and press return to search.
సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీ కి మరోసారి నోటిఫికేషన్ !
By: Tupaki Desk | 11 Jan 2020 6:26 AM GMTఏపీలోని నిరుద్యోగ యువత కు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో 16,207 ఉద్యోగాల భర్తీకి పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ శుక్రవారం (జనవరి 10) నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటిలో 14,061 గ్రామ సచివాలయ పోస్టులు ఉండగా.. 2,146 వార్డు సచివాలయ పోస్టులు ఉన్నాయి. గతేడాది 1.34 లక్షల సచివాలయ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసిన విషయం తెలిసిందే. వాటిలో మిగిలిన ఉద్యోగాలతో పాటు.. ఆ నోటిఫికేషన్ల లో పోస్టుల వారీగా పేర్కొన్న విద్యార్హతలే తాజా నోటిఫికేషన్‌కు కూడా వర్తిస్తాయని అధికారులు తెలిపారు
ఇక 2019 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 1,26,728 గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్షలు నిర్వహించి ఉద్యోగాల భర్తీ చేసిన విషయం తెలిసిందే. సీఎం జగన్ చాలా ప్రతిష్టాత్మకం గా తీసుకోని ఈ గ్రామ/వార్డ్ సచ్చివాలయం సేవలని ప్రారంభించారు. ఇక ఇప్పటికే సర్వీసు లో ఉన్న అభ్యర్థులకు కొన్ని ఉద్యోగాల విషయంలో 10 శాతం మార్కుల వెయిటేజీ ఇవ్వనున్నట్లు గిరిజా శంకర్ పేర్కొన్నారు.
ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాలని అనుకునే అభ్యర్థులు wardsachivalayam.ap.gov.in , gramasachivalayam.ap.gov.in వెబ్ సైట్ల ద్వారా ధరఖాస్తు చేసుకోవచ్చు. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు జనవరి 11 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనవరి 31 అర్ధరాత్రి వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈ పోస్టుల భర్తీకి మార్చి తరువాత రాత పరీక్ష ఉండే అవకాశం ఉంది. అవసరాలకు అనుగుణంగా నోటిఫికేషన్‌లో పేర్కొన్న పోస్టుల సంఖ్య పెరిగే వీలుందని అధికారులు అంటున్నారు.