Begin typing your search above and press return to search.
ఢిల్లీ హింస.. జస్టిస్ మురళీదర్ బదిలీ.. అసలు నిజమేంటి?
By: Tupaki Desk | 29 Feb 2020 11:36 AM GMTముగ్గురు బీజేపీ నాయకుల విద్వేష ప్రసంగాల వల్లే ఢిల్లీ అల్లర్లు చోటుచేసుకున్నాయని.. ఇంత జరిగినా వాళ్ల మీద పోలీసులు యాక్షన్ తీసుకోక పోవడంపై ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మురళీధర్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సీరియస్ అయిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ద్వారా ఆయనను పంజాబ్-హర్యానా హైకోర్టుకు అర్ధరాత్రి బదిలీ చేస్తూ సంచలన ఆదేశాలు ఇచ్చిందని విమర్శలు వచ్చాయి.. జస్టిస్ మురళీధర్ బదిలీ దేశవ్యాప్తంగా దుమారం రేపింది. బీజేపీ కి వ్యతిరేకం గా తీర్పునిస్తే బదిలీ చేస్తారా అని అందరూ ప్రశ్నించారు.
రాజకీయ దుమారంగా మారిన జస్టిస్ మురళీధర్ బదిలీపై తాజాగా భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలక్రిష్ణన్ సంచలన కామెంట్స్ చేశారు. మురళీధర్ బదిలీ యాదృశ్చికమైనా వారం రోజుల క్రితం సుప్రీం కోర్టు కొలీజియం ఆయన బదిలీపై ఉత్తర్వులు ఇచ్చిందని.. మురళీధర్ కూడా తన సమ్మతి తెలియజేశారని కేజీ బాలక్రిష్ణన్ తెలిపారు. మురళీధర్ బదిలీకి ఢిల్లీ హింస కేసు విషయంలో ఆయన చేసిన విచారణ కు సంబంధం లేదని మాజీ సీజేఐ బాలక్రిష్ణన్ అన్నారు.
దేశంలో ఇలాంటి భారీ హింస జరుగుతున్నప్పుడు.. దేశమంతా అస్థిరంగా ఉన్నప్పుడు మీడియా, ప్రజలు చరుకుగా ఉన్నప్పుడు అర్ధరాత్రి బదిలీ ఉత్తర్వులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని మాజీ సీజేఐ బాలక్రిష్ణన్ సూచించారు. దీనిపై ప్రజలు వేరే విధంగా ఆలోచిస్తారని బీజేపీని హెచ్చరించారు. ప్రజలు వ్యతిరేకత పెంచుకుంటే మొదటికే మోసం వస్తుందని తెలిపారు.