Begin typing your search above and press return to search.
ఏపీలో తిరుపతి ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
By: Tupaki Desk | 23 March 2021 8:30 AM GMTఏపీలో మళ్లీ ఎన్నికల సందడి నెలకొంది. పంచాయతీ, మున్సిపల్, ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది.
తిరుపతి ఉప ఎన్నికకు ఈనెల 30వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈనెల 31న పరిశీలిస్తారు. ఏప్రిల్ 3 వరకు ఉపసంహరణ గడువు ఉంటుంది. ఏప్రిల్ 17న పోలింగ్ జరుగనుంది. మే 2న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఆరోజే ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు.
తిరుపతి ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కావడంతో ప్రధాన పార్టీలన్నీ అలెర్ట్ అయ్యాయి. ప్రచారానికి వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు.
ఇక తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీచేయడానికి వైసీపీ నుంచి ప్రముఖ వైద్యుడు డాక్టర్ గురుమూర్తి పేరు ఖరారు కాగా.. టీడీపీ నుంచి కేంద్రమాజీ మంత్రి పనబాక లక్ష్మీ బరిలోకి దిగుతున్నారు. బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.తెరపై నలుగురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీ ఈనెల 24న నామినేషన్ దాఖలు చేయనున్నారు. మిగిలిన అభ్యర్థుల నామినేషన్లపై క్లారిటీ రావాల్సి ఉంది.
తిరుపతి ఉప ఎన్నికను పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వైసీపీ, టీడీపీలు ప్రత్యేక కమిటీలను వేసి రంగంలోకి దిగాయి. నియోజకవర్గాలకు ఇన్ చార్జీలను నియమించాయి. వైసీపీ మంత్రులంతా రంగంలోకి దిగారు. బీజేపీ తరుఫున కీలక నేతలు పనిచేస్తున్నారు. మరి గెలుపు ఎవరిది అన్నది చూడాలి.