Begin typing your search above and press return to search.

కరోనా టీకాకు వ్యతిరేకం అంటున్న స్టార్ ప్లేయర్ ..కారణం ఇదే !

By:  Tupaki Desk   |   20 April 2020 11:30 PM GMT
కరోనా టీకాకు వ్యతిరేకం అంటున్న స్టార్ ప్లేయర్ ..కారణం ఇదే !
X
కరోనా మహమ్మారి ప్రస్తుతం ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురిచేస్తుంది. ఈ మహమ్మారి దెబ్బకి ప్రతి దేశం కూడా వణికిపోతోంది. ఈ కరోనా ను అరికట్టాలంటే ..కరోనా వ్యాక్సిన్ ఒక్కటే మార్గం అని ప్రపంచం మొత్తం భావిస్తుంది. ఈ సమయంలో ప్రపంచంలోని ప్రతి ఒక్కరు ఈ కరోనా టీకా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటే ..సెర్బియా టెన్నిస్‌ స్టార్‌, వరల్డ్‌ నంబర్‌ వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ మాత్రం అందుకు వ్యతిరేకంగా ఉన్నాడు. వ్యక్తిగతంగా తాను కరోనా టీకాను వేయించుకోవడానికి వ్యతిరేకం అని తెలిపాడు.

అయితే , ఈ విషయంలో ఏ ఒక్కరినీ బలవంతం చేయాల్సిన అవసరం లేదు అని, టెన్నిస్‌ ప్లేయర్లు ప్రతీ ఒక్కరూ కరోనా టీకా తీసుకోవడాన్ని తప్పనిసరి చేయాలన్న మహిళా టెన్నిస్‌ మాజీ నంబర్‌ వన్‌ ఎమెలీ మౌరెస్మో సూచనను జొకోవిచ్‌ వ్యతిరేకించాడు. ఒకవేళ కరోనా టీకాను వేయించుకుంటే అది తన ఆటను ఆపేసే అవకాశం కూడా ఉందని జొకోవిచ్‌ ఈ సందర్భంగా తెలిపాడు. దీనితో ఈ విషయంలో వారి వారి నిర్ణయాలకే వదిలి వేయాలన్నాడు.

నేను వ్యక్తిగతంగా కరోనా టీకాకు వ్యతిరేకం. ఈ విషయంలో ఎవర్నీ బలవంతం చేయవలసిన అవసరం లేదు అని కరోనా టీకాను తప్పనిసరి చేస్తే ఏమౌతుంది. ఏ పని అయినా చేయాల్సి వచ్చినప్పుడు వ్యక్తిగత నిర్ణయాలు అనేవి ఉంటాయి. ఇక్కడ నేనే నిర్ణయం తీసుకోవాలి. నా ఆలోచనల ప్రకారమే నిర్ణయం తీసుకుంటాను. సమయాన్ని బట్టి ఆలోచనలు మారతా ఉంటాయి అని జొకోవిచ్‌ తెలిపాడు. ఇక టెన్నిస్ సీజన్ మళ్లీ ఎప్పుడు ప్రారంభం అవుతుంది అని అడగ్గా ..తన అంచనా ప్రకారం జూలై, ఆగస్టు మాసాల్లో టెన్నిస్‌ తిరిగి ఆరంభం అయ్యే అవకాశం ఉందని అనుకుంటున్నట్లు తెలిపాడు. అలాగే , కరోనా మహమ్మారి దెబ్బకు టోర్నీల్లేక ఇబ్బందులెదుర్కొంటున్న యువ ఆటగాళ్లకు ఆర్థికంగా చేయూత అందించేందుకు టెన్నిస్‌ దిగ్గజాలు అయిన రోజర్‌ ఫెడరర్‌ , రాఫెల్‌ నాదల్‌, నొవాక్‌ జొకోవిచ్‌ సిద్ధమవుతున్నారు.