Begin typing your search above and press return to search.
విద్యార్థులే కాదు ఎన్నారై ఉద్యోగులకూ ముప్పు
By: Tupaki Desk | 8 Jan 2016 11:23 AM GMTఅగ్రరాజ్యం అమెరికాలో తిప్పలు పడే ప్రవాస భారతీయుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇన్నాళ్లు చదువుకునే విద్యార్థులకే చుక్కలు చూపించిన అగ్రరాజ్యం ఇపుడు ఉద్యోగులను సైతం వదలడం లేదు. కొత్తగా ఉద్యోగం కోసం వెళుతున్నవారికి పరీక్ష పెడుతున్నారా? అయితే అందులో తప్పేముంది! అనుకునేరు. కొత్తవారినే కాదు. ఇప్పటికే అక్కడ ఉద్యోగం చేస్తున్నవారికి సైతం అంకుల్ శ్యామ్ రాజ్యంలో అవస్థలు ఎదురవతున్నాయి. సెలవుల కోసం - వ్యక్తిగత పనుల మీద ఇండియాకు వచ్చి తిరిగి అమెరికాకు వెళ్లగా...హఠాత్తుగా వీసా కాన్సిల్ అంటూ అధికారులు నోటిసులు ఇస్తున్నారట. అది కూడా ఏకంగా ఎయిర్ పోర్ట్ లోనే పట్టుకొని మరీ వెనక్కి పంపడం అసలు ట్విస్ట్.
అమెరికాలో ఉద్యోగం చేసేందుకు భారతీయులు హెచ్1బీ వీసాను తీసుకొని వెళ్తారు. అలా వెళ్లినవారు తమ కొలువును కొనసాగిస్తూ క్రిస్ మస్ వంటి సెలవులకు వీసా స్టాంపింగ్ చేయించుకునేందుకు స్వదేశానికి తిరిగి వచ్చిన సమయంలో చాలామంది వీసాలు రద్దుచేస్తున్నారట. అనేక కేసుల్లో కారణాలు చెప్పకపోయినప్పటికీ మెజార్టీ వ్యక్తులకు నకిలీ సర్టిఫికేట్ల ద్వారా ఉద్యోగం పొందారని లేకపోతే తాము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేదనే ఉద్దేశంతో ఇండియాకు వెళ్లిపోయేలా ఆదేశాలు ఇస్తున్నారని తెలుస్తోంది. ఇటీవల ఓ సీనియర్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి భారతదేశానికి క్రిస్ మస్ సెలవులకు వచ్చి తిరిగి అమెరికాకు వెళ్లగా అక్కడి ఎయిర్ పోర్టులోనే ఆయన్ను అమెరికా కస్టమ్స్ ఆండ్ బోర్డర్స్ ప్రొటెక్షన్(సీబీపీ) అధికారులు నిలిపివేశారు. అమెరికాలో ప్రవేశం లేదని చెప్పడమే కాకుండా దేశంలో ఉండకుండా 5 ఏళ్ల పాటు నిషేధం కూడా విధించారు. దీంతో చేసేదేమీ లేక ఆయన తన కంపెనీకి విన్నవించగా....అధికారుల తీరుపై న్యాయపోరాటానికి సదరు అమెరికా కంపెనీ సిద్ధమయింది.
నకిలీ సర్టిఫికేట్లలో కూడా ఆసక్తికరమైన కారణం ఉండటం విశేషం. భద్రతతో కూడిన ఉద్యోగం, మెరుగైన జీతం వంటి ప్రయోజనాలు ఆశించి నకిలీ ఎక్స్ పీరియెన్స్ పత్రాలను వివిధ కన్సల్టెన్సీల నుంచి పలువురు కొనుగోలు చేస్తున్నారు. వాటి ద్వారా అమెరికాకు వెళ్లి కొలువులు చేస్తున్నారు. అమెరికాలో ఇటీవల మారిన పరిస్థితుల నేపథ్యంలో దర్యాప్తులో ఈ అంశాలు బయటపడటంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై నిపుణులు స్పందిస్తూ...నకిలీలకు వీలైనంత దూరంగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు. అదే క్రమంలో అమెరికాలో ఉద్యోగం చేసేందుకు వెళ్లే సమయంలో, ఉద్యోగం చేస్తున్న సమయంలో ఎదురయ్యే ప్రశ్నలకు స్పష్టంగా, సూటిగా సమాధానాలు చెప్పాలని సూచిస్తున్నారు.
అమెరికాలో ప్రారంభమైన ఈ ట్రెండ్ తో పలువురు భారతదేశ ప్రయాణాలను క్యాన్సిల్ చేసుకున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ ఆన్ లైన్ ట్రావెల్ సంస్థ మేక్ మై ట్రిప్ ధ్రువీకరించింది. జనవరి - ఫిబ్రవరీ నెలల్లో అమెరికా నుంచి మనదేశానికి రావడానికి టికెట్లు బుక్ చేసుకున్న వారిలో దాదాపు 6000 మంది తమ ప్రయాణాన్ని రద్దు చేసుకోవడం లేదా వాయిదా వేసుకోవడం వంటి నిర్ణయాలను తీసుకున్నారని సంస్థ వివరించింది. మొత్తంగా అమెరికాలో ఉన్న భారతీయులు..ఈ గడ్డు కాలాన్నీ ధైర్యంగా ఎదుర్కోవాలి.