Begin typing your search above and press return to search.

జస్ట్ డయల్.. అలాంటి పాడు పని చేస్తుందా?

By:  Tupaki Desk   |   9 Nov 2021 6:40 AM GMT
జస్ట్ డయల్.. అలాంటి పాడు పని చేస్తుందా?
X
అవసరం ఏదైనా సరే.. మమ్మల్ని అడగండి.. మీకు సమాచారం ఇస్తామంటూ ప్రచారం తో ఉదర గొట్టే జస్ట్ డయల్ గురించి తెలీని వారు ఉండరు. ఆ మాట కు వస్తే.. ఈ సేవల సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా బిగ్ బి అమితాబ్ వ్యవ హరిస్తుండటం తెలిసిందే. అందరి కి తెలిసిన జస్ట్ డయల్ గురించి ఎవరికి తెలీని కొత్త నిజం తాజాగా బయటకు వచ్చి సంచలనం గా మారింది. స్పా సేవల పేరు తో వ్యభిచార రాకెట్ ను జస్ట్ డయల్ ప్రోత్సహించిందన్న ఆరోపణలు ఈ సంస్థ మీద వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు తాజాగా ఈ ఆరోపణల పై దర్యాప్తు చేయటానికి వీలుగా ఢిల్లీ మహిళా కమిషన్ సమన్లు జారీ చేయటం సంచలనంగా మారింది.

అంతే కాదు.. ఈ సంస్థ పై కేసు నమోదు చేయాలని కోరుతూ మహిళా కమిషన్ తాజాగా ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ కు నోటీసులు జారీ చేసింది కూడా. అంతేకాదు.. ఇటీవల కాలం లో ఈ సంస్థ పై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యం లో ఒక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. కొన్ని స్పా సంస్థల కు సంబంధించిన చీకటి కోణాల్ని తెలియజేస్తూ మహిళా కమిషన్ కు 15 కాల్స్.. 32 వాట్సాప్ మెసేజ్ లు వచ్చినట్లుగా వెల్లడించారు.

ఒక ఫోన్ నెంబరు నుంచి వచ్చిన వాట్సాప్ మెసేజ్ లో 150 మంది యువతుల ఫోటోలు.. వారి సేవల కు సంబంధించిన ధరల పట్టిక ను పంపినట్లు గా గుర్తించారు. అంతే కాదు.. మరో ఫోన్ నెంబరు నుంచి వచ్చిన మెసేజ్ లో 14 మంది యువతుల ఫోటోల్ని పంపించినట్లుగా గుర్తించారు. స్పా సేవల పేరు తో సదరు సంస్థలు వ్యభిచార కార్యకలాపాల్ని.. మహిళల అక్రమ రవాణాను ప్రోత్సహించేలా చేస్తున్నట్లుగా గుర్తించారు. ఇదంతా జస్ట్ డయల్ సంస్థ ద్వారా సాగటం గమనార్హం.

ఈ నేపథ్యం లో ‘జస్ట్‌ డయల్’ మేనేజ్‌మెంట్‌ ని పిలిపించి లిస్టు చేసిన స్పాల తనిఖీల కోసం వారి విధానాన్ని వివరించాలని కోరింది. సంస్థ సైట్ లో లిస్టు చేయటానికి జస్ట్ డయల్ తీసుకున్న డబ్బు మొత్తాల వివరాల్ని అందించాలని కమిషన్ కోరింది. రాజధానిలో వ్యభిచార రాకెట్ లను నిర్వహించటం ఆశ్చర్యకరమని మహిళా కమిషన్ వ్యాఖ్యానించింది. అంతేకాదు.. జస్ట్ డయల్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అరెస్టు చేయాలని ఢిల్లీ పోలీసులకు నోటీసు జారీ చేశారు. జస్ట్ డయల్ లాంటి సంస్థ లో ఇలాంటి కోణం ఇప్పుడు సంచలనంగా మారింది.