Begin typing your search above and press return to search.
శవాల దిబ్బగా చైనా.. ఏం జరుగుతోంది?
By: Tupaki Desk | 27 Dec 2022 4:05 AM GMTడ్రాగన్.. కంట్రీ.. చైనా! మిన్ను విరిగి మీదపడుతున్నా.. అక్కడ ఏం జరుగుతోందనే మాత్రం అత్యంత రహస్యం. ఎవరో చెబితేనో.. ఎలాగో తెలిస్తేనో.. తప్ప.. ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు.. కార్యకలాపాలు మాత్రం బయటి ప్రపంచానికి తెలియడం లేదు.
తాజాగా కరోనా ప్రభంజనం.. ఇప్పుడు చైనా దేశాన్ని శవాల దిబ్బగా మార్చేసింది. ఇది నిజంగా నిజం!! పరిస్థితులు ఊహించిన దానికంటే మరింత దారుణంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా గుట్టలుగా పేరుకుపోయిన శవాలే కనిపిస్తున్నాయి.
అంతేకాదు.. శవఖననాలు, దహనాల కోసం.. ఊళ్లకు ఊళ్లు పయనిస్తున్నారు. పక్క గ్రామాలకు తీసుకువెళ్తున్నారు. శ్మశానాల వద్ద ఎక్కడ చూసినా శవాలను మోసుకొస్తున్న వారితో క్యూలు దర్శనమిస్తున్నాయి. ఆస్పత్రుల్లో పడకలు లేక.. అంబులెన్స్‌ల్లో నే రోజుల తరబడి చికిత్స చేయాల్సి వస్తోంది. చైనా రాజధాని ప్రాంతం బీజింగ్‌తో సహా ఎక్కడ చూసినా ఆత్మీయులను పోగొట్టుకున్న వారి రోదనలు ప్రతిధ్వనిస్తున్నాయి.
అంతా దాపరికమే!
కాగా, చైనా మళ్లీ తన కుట్ర పూరిత బుద్ధిని బయట పెడుతూనే ఉంది. సొంత దేశంలో సమాచారాన్ని కూడా సొంత ప్రజలకు చేరవేయడం లేదు. ఎవరు చనిపోయారు? ఎందుకు చనిపోయారు? వంటి అంశాలను చైనా కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తోంది. చైనా ఆరోగ్య కమిషన్ నుంచి లీక్ అయిన రహస్య సమాచారం ప్రకారం ఇప్పటికే 25 కోట్ల మంది వైరస్‌కు సోకినట్లు ప్రపంచానికి తెలుస్తోంది.
ఎక్కడబడితే అక్కడే వైద్యం!
కొత్తగా కరోనా సోకిన వారికి బెడ్లు లేకపోవడంతో అంబులెన్సులు, ఆస్పత్రుల ప్రాంగణాల్లోనే..చికిత్స అందిస్తున్నారు. ఏ ఆస్పత్రిలో అయినా బెడ్ దొరక్కపోదా అని ఆశతో రోగుల బంధువులు వందల కిలోమీటర్లు తిరుగుతున్నారు. బాధితులను వీల్ ఛైర్‌లలో కూర్చోబెట్టి చికిత్స అందించాలంటూ ఆస్పత్రి వర్గాలను వేడుకుంటున్నారు. హెబెయ్ ప్రావిన్స్‌లోని జువాఝౌలో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సరిపడక అత్యవసర చికిత్సకు వైద్యులు చేతులెత్తేస్తున్నారు.
అహోరాత్రులూ.. శవ దహనాలే!
చైనాలోని చాలా ప్రాంతాల్లో శ్మశాన వాటికల్లో అహోరాత్రులూ శవాలు తగలబడుతూనే ఉన్నాయి. దహనం చేసేందుకు శవాలతో బంధువులు రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. బీజింగ్, హెబెయ్ సహా దాదాపు చైనా అంతా ఇదే పరిస్థితి నెలకొంది. బీజింగ్ లో శ్మశాన వాటికలు చాలక గంటల తరబడి ప్రయాణించి ఇతర చోట్లకు చేరుకుంటున్నారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు వందల మీటర్ల మేర క్యూలు కట్టిన దయనీయమైన దృశ్యాలను ఓ చైనా ఆరోగ్యాధికారి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.