Begin typing your search above and press return to search.

డీజిల్ డోర్ డెలివ‌రీ..మ‌న పెట్రో కంపెనీ స్పెష‌ల్‌

By:  Tupaki Desk   |   3 Jan 2019 9:00 AM GMT
డీజిల్ డోర్ డెలివ‌రీ..మ‌న పెట్రో కంపెనీ స్పెష‌ల్‌
X
స్మార్ట్‌ఫోన్లు మ‌న‌కు తెచ్చిన అనేక వెసులుబాట్ల‌లో యాప్‌ల ద్వారా మ‌న‌కు కావాల్సిన వాటిని ఆర్డ‌ర్ చేసుకుంటే...అవ‌న్నీ మ‌న ఇంటి ముంద‌రికే వ‌చ్చేయ‌డం ఒక‌టి. ఆన్‌లైన్లో ఆర్డర్ చేస్తే ఇంటికే వస్తున్న వస్తువుల్లానే.. ఇంటి దగ్గరకే పెట్రోల్ - డీజిల్ వ‌స్తే ఎలా ఉంటుంది? ఏంటి నిజంగా అలా జ‌రుగుతుందా...పైగా మ‌న‌దేశంలో అది అయ్యే ప‌నేనా? అంటారా? నిజంగానే జ‌రుగుతుంది....మ‌న‌దేశంలోనే సాధ్య‌మ‌వుతుంది కూడా.

ప్రముఖ ఆయిల్ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇంటికే ఇంధనం కాన్సెప్ట్.. భారతదేశంలోనే డీజిల్ డోర్ డెలివ‌రీ అమలు చేస్తోంది. ఈ సర్వీసులను ఫస్ట్ టైమ్ పుణె నగరంలో ప్రవేశపెట్టింది. తర్వాత ఇతర నగరాలకు కూడా క్రమంగా విస్తరిస్తోంది. డోర్ స్టెప్ డెలివరీ ఆఫ్ ఫ్యూయెల్ పేరుతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ ఇంధనం ఇంటి దగ్గరకే డెలివర్ చేస్తోంది. తాజాగా ఈ సర్వీసును చెన్నై నగరంలో ప్రారంభించింది. ప్రస్తుతం డీజిల్‌ ను మాత్రమే డోర్ స్టెప్ డెలివరీ చేస్తున్నారు. పెట్రోలు డీజిల్ కంటే ప్రమాదం కనుక ముందుగా డీజిల్‌ను మాత్రమే సరఫరా చేస్తున్నారు. అధికంగా డీజిల్ వాహనాల వినియోగం ఎక్కువగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఫెసిలిటీతో సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయని కస్టమర్లు చెబుతున్నారు.

ప్ర‌స్తుతం యాప్ సర్వీసును కూడా అందుబాటులోకి తెచ్చింది. ఫ్యూయెల్ డోర్ డెలివరీ కావాలంటే… కంపెనీ యాప్(Repos App) ద్వారా ఆర్డర్ ఇవ్వాలి. ఆర్డర్ కనీసం 200 లీటర్లు అయి ఉండాలి. కస్టమర్లు 2,500 లీటర్లు అంతకుమించి ఇంధనం కావాలంటే PESO లైసెన్సు కలిగి ఉండాలి. ఇంత‌కీ ఈ డోర్ డెలివ‌రీ ఎలా అవుతుంద‌ని అనుకుంటున్నారా? సాధారణంగా మనం పెట్రోల్ బంకుల్లో చూసే మెషీనే ఈ ట్రక్కులో ఉంది. పెట్రోల్ బంకుల్లో వెహికల్స్ లో ఫ్యూయెల్ నింపినట్టుగానే.. ఈ ట్యాంకర్ నుంచి ఇంధనాన్ని వాహనంలోకి నింపుతారు. ఈ ట్యాంకులో అగ్నిప్రమాదం సంభవించకుండా తగిన చర్యలు తీసుకున్నామ‌ని అధికారులు వెల్ల‌డిస్తున్నారు.