Begin typing your search above and press return to search.
కుక్కలను చంపితే గోల్డ్ కాయిన్
By: Tupaki Desk | 31 Oct 2016 6:11 AM GMTఇంట్లో ఎలుకల బెడద.. వీధిలో కుక్కల బెడద అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎలుకల సమస్య తీవ్రంగానే ఉంది. పొలాల్లో పంటను తినేయడం నుంచి.. ఇళ్లల్లోనూ నిత్యం తిరుగుతూ వస్తువులను కొరికేస్తుండే ఎలుకల సమస్య అనేక దేశాల్లో ఉంది. ఎలుకల వల్ల ప్లేగు వంటి వ్యాధులు వచ్చే ప్రమాదమూ ఉన్నందున చాలా దేశాలు ఎలుకల సంహారంపై దృష్టి పెడతాయి. ఎలుకల సంతతి పెరిగిపోయిన సందర్భాల్లో వాటిని చంపితే బహుమతులు కూడా ప్రకటిస్తారు. ఎలుకకు రూ.25.. 30.. 50 ఇలా ఇస్తుంటారు. ఇప్పటికే బంగ్లాదేశ్ - పాకిస్థాన్ - ఫిలిప్పీన్సు - వియత్నాం - కంబోడియా వంటి దేశాల్లో ఇలాంటివి చూశాం. బంగ్లాదేశ్ లో అయితే 2009లో ఓ వ్యక్తి కేవలం ఎలుకలను చంపి ప్రభుత్వ అధికారులకు ఇచ్చి ఏకంగా 83 వేల రూపాయలు సంపాదించాడట. తాజాగా మన దేశంలోని కేరళలో కూడా ఇలాంటిదే ఒక ఆలోచన చేశారు. అయితే.. అక్కడ ఎలుకల కోసం కాకుండా కుక్కలను పట్టివ్వడానికి బహుమతులు పెట్టారు.
కేరళలో వీధి కుక్కల సమస్య తీవ్రమైంది. గత రెండేళ్లలో వీటిబారిన పడి వేలాదిమంది గాయపడ్డారు. పదుల సంఖ్యలో పిల్లలు - వృద్ధులు మృత్యువాతపడ్డారు. వీటి నిర్మూలనకు అక్కడి ప్రభుత్వాలు ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా జంతు ప్రేమికులు కోర్టు గడప తొక్కుతుండటంతో సమస్య పరిష్కారం కావడం లేదు. అందుకే, ఓ కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థుల సంఘం వారు ఓ వినూత్న ఆఫర్ ప్రకటించారు. డిసెంబరు 10లోపు ఎక్కువ కుక్కలను చంపినవారికి బంగారు నాణేలు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు.
కేరళలో వీధి కుక్కలు పులుల్లా మనుషులను పీక్కుతింటున్నాయట. ఈ నెల 26న 90 ఏళ్ల వృద్ధుడిని కుక్కలు చంపి తినడం సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో వీధి కుక్కలను వధించే వారిని ప్రోత్సహించేందుకు విద్యార్థుల సంఘం.. బంగారు నాణేలు ఇస్తామని ఆఫర్ ప్రకటించింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/