Begin typing your search above and press return to search.

ఇక‌, మోడీ సిద్ధాంత‌మే.. బీజేపీ ఉంటుందంతే!

By:  Tupaki Desk   |   17 Sep 2022 10:30 AM GMT
ఇక‌, మోడీ సిద్ధాంత‌మే.. బీజేపీ ఉంటుందంతే!
X
భార‌తీయ జ‌న‌తా పార్టీ. ఈ పార్టీకి కొన్ని సిద్ధాంతాలు.. ప్ర‌త్యేక అభిలాష‌లు కూడా ఉన్నాయి. వ్య‌క్తి పూజ‌కు ఎక్క‌డా... ఎప్పుడూ.. ఈ పార్టీలో చోటు లేదు. గ‌తంలో ప్ర‌ధానిగా చేసిన‌.. వాజ‌పేయి నుంచి అనేక సీనియ ర్ నేత‌ల వ‌ర‌కు పార్టీ లైన్‌, సిద్ధాంతాల‌ను ఎప్పుడూ.. దాచింది లేదు.. బ‌రితెగించింది అంత‌క‌న్నా లేదు. అందుకే..వారు బీజేపీ నేత‌లుగా స్థిర‌ప‌డ్డారు. బీజేపీ అంటే.. ఆనేత‌లు గుర్తుకు వ‌స్తారు. అయితే.. కాలం మారింద‌నే కార‌ణాన్ని చూపుతూ.. ఇప్పుడు బీజేపీనే మార్చేస్తున్నార‌నే వాద‌న వినిపిస్తోంది.

వ్య‌క్తి పూజ‌కు.. ప్ర‌స్తుత ప్ర‌ధాని మోడీ ఇస్తున్నప్రాధాన్యం అంతా ఇంతా కాదనేది స‌ర్వ‌త్రా వినిపిస్తున్న మాట‌. ప్ర‌తిప‌క్షాలు కూడా ఇదే మాట‌ను ప‌దే ప‌దే అంటున్నాయి. ఇక‌, ఇప్ప‌టి వ‌ర‌కు.. ఏ నేతా కూడా.. త‌న పుట్టిన రోజును..(బీజేపీలో) దేశ‌వ్యాప్తంగా పండ‌గ మాదిరిగా నిర్వ‌హించుకున్న సంద‌ర్భం లేదు. అంతేకాదు.. వాజ‌పేయి అయితే.. త‌న పుట్టిన రోజును నిర్వ‌హించుకునేందుకు కూడా.. ఇబ్బంది ప‌డేవారు. పార్టీ త‌ర‌ఫున ప్ర‌జ‌ల‌కు మ‌రింత సేవ చేయాల‌ని.. చెప్పేవారు.

ఎందుకంటే.. ఆ రోజు శాంతి దూత ఏసుక్రీస్తు పుట్టిన రోజుగా ఆయ‌న చెప్పేవారు. వాజ‌పేయి... డిసెంబ‌రు 25న జ‌న్మించారు. ఆరోజు క్రిస్మ‌స్‌. మ‌రి ఈస్పూర్తి.. మోడీలో ఎక్క‌డా క నిపించ‌డం లేదు. పైగా.. ఆయ‌న త‌న పుట్టిన రోజును.. దేశ‌వ్యాప్తంగా.. త‌న పేరు మార్మోగేలా.. సుమారు.. 15 రోజుల పాటు.. ఉత్స‌వాలు చేయాల‌ని అన‌ధికారిక ఆదేశాలు జారీ చేశారు. దీంతో దేశంలో బీజేపీ నాయ‌కులు.. ఉత్స‌వాల‌కు రెడీ అయ్యారు. నేటి నుంచి(శ‌నివారం సెప్టెంబ‌రు 15) ‘సేవా పఖ్వారా’ పేరిట‌.. మోడీ చేసిన సేవ‌ల‌ను దేశం మొత్తం వినిపించే కార్య‌క్ర‌మాలు ప్రారంభం కానున్నాయి.

మహాత్మాగాంధీ జయంతి అయిన అక్టోబరు 2వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ కార్య‌క్ర‌మాల్లో మోడీ భ‌జ‌న మ‌రింత పెరగ‌నుంది. ఇప్ప‌టికే.. కేంద్రంలో మోడీ స‌ర్కారు కొలువుదీరిన త‌ర్వాత‌.. ఆయ‌న భ‌జ‌న పెరిగిపోయింద‌నే వాద‌న బ‌లంగా ఉంది. ఇక‌, ఇప్పుడు ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ఈ నామ సంకీర్త‌న‌ను మ‌రింత ముందుకు తీసుకువెళ్లే వ్యూహంతో.. బీజేపీని.. ఆ పార్టీ సిద్ధాంతాల‌ను కూడా తుంగ‌లో తొక్కుతున్నార‌నే వాద‌న విశ్లేష‌కుల నుంచి వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.