Begin typing your search above and press return to search.

న‌గ‌లు కొంటున్నారా.. నో పాన్

By:  Tupaki Desk   |   7 Oct 2017 8:09 AM GMT
న‌గ‌లు కొంటున్నారా.. నో పాన్
X
దూకుడు అన్నిసార్లు మంచిది కాదు. ఆ విష‌యం మోడీ బ్యాచ్‌కి ఇప్పుడిప్పుడే తెలిసి వ‌స్తోంది. కొండ నాలిక‌కు మందు వేస్తే ఉన్న నాలిక పోయిన చందంగా.. దారి త‌ప్పి పోయే ప‌న్నును ఖ‌జానాకు తెచ్చుకోవాల‌న్న తొంద‌ర‌లో ఇప్పుడు వ‌చ్చే ఆదాయాన్ని పోగొట్టుకున్న తాలూకు ఎఫెక్ట్ ఎంత తీవ్రంగా ఉంటుంద‌న్న‌ది మోడీ ప‌రివారానికి తెలిసి వ‌చ్చిన‌ట్లుగా ఉంది.

ఖ‌జానాకు ఆదాయాన్ని పెంచుకోవాల‌నుకోవ‌టం త‌ప్పేం కాదు కానీ.. ఇప్ప‌టివ‌ర‌కున్న వెసులుబాట్లను మూసేసి.. మొత్తంగా ప‌రిమితుల చ‌ట్రంలోకి తీసుకొస్తే వ‌చ్చే త‌ల‌నొప్పి ఏమిటో ఇప్పుడు అర్థ‌మైన‌ట్లుగా ఉంది. న‌గ‌లు కొనేవారు.. తాము కొన్న న‌గ‌లు రూ.50వేల‌కు మించితే పాన్ కార్డు చూపించ‌టం త‌ప్ప‌నిస‌రి అంటూ ప్ర‌భుత్వం విధించిన ప‌రిమితిని తాజాగా ఎత్తేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

జీఎస్టీ మండ‌లి స‌మావేశ‌మై.. ప‌లు అంశాల‌ను చ‌ర్చించిన నేప‌థ్యంలో.. న‌గ‌ల కొనుగోలుకు పాన్ త‌ప్ప‌నిస‌రి అన్న కండీష‌న్‌ను ప‌క్క‌న పెట్టేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. అంతేకాదు.. న‌గ‌ల వ్యాపారుల‌ను అక్ర‌మ న‌గ‌దు చ‌లామ‌ణి చట్టం కింద‌కు తీసుకొచ్చే నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసేసుకొని.. వారిని ఆ ప‌రిధి నుంచి మిన‌హాయిస్తూ మ‌రో కీల‌క నిర్ణ‌యాన్ని వెల్ల‌డించింది. ప‌రిమితులు విధించ‌టం మంచిదే. కానీ.. ఆ పేరుతో అదే ప‌నిగా ఒత్తిడికి గురి చేస్తే ప్ర‌భుత్వానికే ఎంత లాస్ అన్న విష‌యం మోడీ ప‌రివారానికి బాగా తెలిసి వ‌చ్చిన‌ట్లుగా ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ప్ర‌భుత్వం తాజాగా తీసుకున్న నిర్ణ‌యంతో న‌గ‌లు కొనేట‌ప్పుడు పాన్ చూపించాల్సిన అవ‌స‌రం లేద‌న్న అప్డేట్‌ను మ‌ర్చిపోకండి.