Begin typing your search above and press return to search.
స్విగ్గి.. ఇక ఇంటికే అన్నీ అట..
By: Tupaki Desk | 13 Feb 2019 6:42 AM GMTమొన్నటివరకూ ఇంటికి కావాల్సిన వస్తువులను ఆన్ లైన్ అంగడులు అమేజాన్, ఫ్లిప్ కార్ట్ లనుంచి తెప్పించుకునేవాల్లం.. ఇప్పుడు తిండిని కూడా ఆన్ లైన్ ద్వారా ఆర్డర్ ఇస్తూ తెగ తింటున్నారు. ఈ మధ్యకాలంలో ఆన్ లైన్ లో ఆర్డర్ చేసి ఆహార పదార్థాలు ఇంటికే తెప్పించుకోవడం బాగా ఊపందుకుంది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో వండుకునే తీరిక లేనివాళ్లు.. దంపతులు తీరిక లేక ఆన్ లైన్లో ఆర్డర్లతో ఆకలి తీర్చుకుంటున్నారు. స్విగ్గీ- జొమాటో- ఫుడ్ పాండా- ఉబర్ ఈట్స్ టిన్ మెన్ వంటి ఆన్ లైన్ కంపెనీలు జోరుగా ఆహార వ్యాపారం సాగిస్తున్నాయి. హైదరాబాద్ లో ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ ఇప్పుడు సత్తా చాటుతోంది. రోడ్ల మీద ఎక్కడ చూసినా డెలివరీ బాయ్స్ ఫుడ్ బాక్స్ లతో కనిపిస్తున్నారు.
తాజాగా స్విగ్గీ అన్ని సంస్థలకు భిన్నంగా తన సేవలు విస్తరిస్తోంది. ఆహార పదార్థాలనే కాదు.. స్విగ్గీ ఇక నుంచి కిరాణా సరుకులను కూడా డెలివరీ చేయడానికి సిద్ధమైంది. ఈ మేరకు కిరాణా సరుకులను ఆర్డర్ చేయవచ్చని ప్రకటన జారీ చేసింది. తమ సిటీలో ఉన్న పాపులర్ స్టోర్స్ నుంచి కస్టమర్లు తమకు కావాల్సిన సరుకులను తెప్పించుకోవచ్చని తెలిపింది.
ఇందుకు గాను స్విగ్గీ సిటీలో ఉన్న పాపులర్ స్టోర్స్ తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఇక స్విగ్గీ సేవలను కూడా విస్తరిస్తోంది. ఈ కిరాణా వస్తువుల పంపిణీని ముందుగా గుర్గావ్ లోనే ప్రారంభం కాగా.. త్వరలోనే దేశంలోని పలు ఇతర నగరాలు, పట్టణాల్లోనూ ఈ సేవలను ప్రారంభించనున్నారు. ఆయా సిటీల్లో ఉన్న కిరాణా షాపులు, సూపర్ మార్కెట్లు, పాన్ షాపులు, పెట్ కేర్ స్టోర్స్- ఫ్లోరిస్ట్స్- బేబి కేర్ స్టోర్స్- ఆర్గానిక్ స్టోర్స్ లో లభించే వస్తువులను స్విగ్గి కస్టమర్లు ఆర్డర్ చేసి పొందవచ్చని సంస్థ ఒక ప్రకటనలో కోరింది.