Begin typing your search above and press return to search.

ఆ చానెల్ సీఈవోకు ఇప్పుడు అన్నీ కట్స్

By:  Tupaki Desk   |   5 July 2019 7:00 AM GMT
ఆ చానెల్ సీఈవోకు ఇప్పుడు అన్నీ కట్స్
X
తెలుగు మీడియా అంతా గుప్పిట పట్టి చంద్రబాబు చేసిన మీడియా మేనేజ్ మెంట్ గురించి ఇప్పటికీ కథలుగా చెబుతారు. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డిని.. నేడు వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు మీడియా ఎంతలా విష ప్రచారం చేసిందో చూశాం.

అయితే వైసీపీకి సపోర్టుగా ఉన్న ఒక తెలుగు న్యూస్ చానెల్ యాజమాన్యం మాట వినకుండా మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రూలింగ్ పార్టీ అయిన టీడీపీకి సపోర్టుగా కథనాలు, వార్తలు ప్రసారం చేసిన ఆ చానెల్ సీఈవో వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. యాజమాన్యం వైసీపీ వెంట ఉన్నా.. సదురు చానెల్ సీఈవో మాత్రం టీడీపీని, చంద్రబాబును ఎత్తుకొని ప్రచారం చేశారు. ఎవ్వరూ చెప్పినా వినలేదు. మేనేజ్ మెంట్ ఎంత చెప్పినా లెక్క చేయలేదు.

అయితే ఎన్నికల ఫలితాలు వచ్చాయి. సదురు చానెల్ సపోర్ట్ చేసిన చంద్రబాబు ఈ ఎన్నికల్లో ఓడిపోయాడు. ఇప్పుడు పరిస్థితి మొత్తం మారింది. జగన్ గెలవడంతో తప్పుడు కథనాలు ప్రసారం చేసిన సదురు చానెల్ సీఈవోకు ఎటూ తోచడం లేదు. ఇక తమ మాట వినని సీఈవో విషయంలో గుర్రుగా ఉన్న మేనేజ్ మెంట్ కూడా సంస్థను గ్రిప్ లోకి తెచ్చుకుందట.. ఇప్పుడు సదురు సీఈవో కాలు కాలిన పిల్లలా ఆ సంస్థలో ఇమడలేక.. వైసీపీకి వ్యతిరేకంగా రాజకీయాలు చేయలేక వేరే సంస్థల్లోకి వెళ్లడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాడట..

సదురు సీఈవో వైసీపీపై వ్యతిరేక కథనాలు రాసి ఎన్నికల వేళ చేసిన రాద్ధాంతం అంతా ఇంతాకాదు.. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం రావడంతో వైసీపీ ముఖ్య నాయకుడితో సంప్రదింపులకు దిగాడట.. అయితే ఇతడి టీడీపీ అనుకూల విధానం తెలిసిన వైసీపీ ముఖ్య నాయకుడు ఈ హాయ్ బాయ్ చెప్పి వెళ్లిపోయాడట.. దీంతో సదురు సీఈవో పని అయిపోందని భావించి ప్రస్తుతం ఇతర చానెల్ కు వెళ్లడానికి ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు సమాచారం. కానీ ఈయన టీడీపీ అభిమానం చూసి ఏ చానెల్ కూడా చాన్స్ ఇవ్వడం లేదట.. వైసీపీ ప్రభుత్వం ఉండడంతో ఈయనను తీసుకుంటే దెబ్బైపోతామని అందరూ దూరం పెడుతున్నారట.. చూడాలి మరీ వైసీపీపై కక్ష గట్టిన సదురు జర్నలిస్టు పరిస్థితి ఇప్పుడు ఉన్నదీ పోయింది ఉంచుకున్నది పోయిందనేలా ఉందట.. మరి సదురు జర్నలిస్టు అదే సంస్థలో కాంప్రమైజ్ అయ్యి ఉంటాడా లేక వేరే చానెల్ కు వెళ్తాడా అన్నది పొలిటికల్ , జర్నలిస్ట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.