Begin typing your search above and press return to search.
ఇక, కాంగ్రెస్‌ను బతికించుకోవడం ఎవరి వల్లాకాదు.. రీజన్ ఇదే
By: Tupaki Desk | 28 Sep 2022 3:33 PM GMTదేశవ్యాప్తంగా .. కాంగ్రెస్‌నుబతికించుకునేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తుంటే.. బీజేపీ ఇస్తున్న ఝలక్‌లో పార్టీ తెరమరుగయ్యే పరిస్థితి నెలకొంది. నిన్నటికి నిన్న గోవాలో పార్టీ ఎమ్మెల్యేలు కట్టకట్టుకుని.. బీజేపీలో చేరిపోయారు. ఈ పరిణామం నుంచి పార్టీ ఇంకా తేరుకోనేలేదు. ఇంతలోనే హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.
కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్ హర్ష్ మహాజన్ భారతీయ జనతా పార్టీలో చేరారు. హర్ష్ మహాజన్ గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. మాజీ సీఎం వీరభద్రసింగ్‌కు ప్రధాన అనుచరుడు కూడా. కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ సమక్షంలో బీజేపీలో చరిన హర్ష్ మహాజన్ ఆ తర్వాత పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డాతో సమావేశమయ్యారు.
వాస్తవానికి ఓ పక్క భారత్ జోడో అంటూ రాహుల్ దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ నేతలంతా ఆ పార్టీకి బైబై చెబుతున్నారు. ఇటీవలే గోవాలో 8 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. తాజా పరిణామాలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి చేదు అనుభవాన్ని మిగుల్చుతున్నాయి. ఓ పక్క కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని రాహుల్ సహా అగ్రనాయకత్వం కలలు కంటుంటే కీలక నేతలంతా హస్తం పార్టీని వీడిపోతున్నారు.
రాజస్థాన్‌లోనూ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ వర్గీయుల మధ్య కుమ్ములాటలు పార్టీని నవ్వులపాలు చేస్తున్నాయి. రాజస్థాన్ వివాదం ఇంకా ముగియక ముందే హిమాచల్ ప్రదేశ్‌లో హర్ష్ మహాజన్ పార్టీని వీడటం కాంగ్రెస్ అధిష్టానానికి మింగుడు పడటం లేదు.
హిమాచల్ ప్రదేశ్‌లో అతి త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ సీఎం జై రామ్ ఠాకూర్ నేతృత్వంలో దూసుకుపోతుండగా కాంగ్రెస్ పార్టీకి హర్ష్ మహాజన్ ఇచ్చిన షాక్ తేరుకోలేకుండా చేస్తోంది. అటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా హిమాచల్ ప్రదేశ్‌లో ప్రచారం ఉధృతంగా సాగిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా దెబ్బతినడం ఖాయమని పరిశీలకులు చెబుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.