Begin typing your search above and press return to search.
వర్క్ ఫ్రమ్ హోమా... హడలెత్తుతున్న ఉద్యోగులు!
By: Tupaki Desk | 22 Aug 2020 2:30 AM GMTవర్క్ ఫ్రమ్ హోమ్.. గతం లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు మాత్రమే ఉండేది. అదికూడా కొంతమందికే. ఇప్పుడు కరోనా కారణంగా చాలా అన్ని రకాల సంస్థలను మూసివేశారు. ఉద్యోగులతో ఇంటి నుంచే పని చేయించుకోవడం మొదలుపెట్టారు. మొదట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అనగానే ఉద్యోగులు ఎగిరి గంతులేశారు. కరోనా పుణ్యమా.. అని ఎన్నో ఏళ్ల తర్వాత ఇళ్లకు చేరుకొని అక్కడి నుంచే పని చేసుకుంటూ.. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతున్నామని సంతోషం వ్యక్తం చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్.. సంబంధాలను దగ్గర చేసిందన్నారు. అయితే కరోనా లాక్ డౌన్లు ఏ నెలో.. రెండు నెలలో.. ఉంటుందని.. అంతవరకు సంతోషంగా గడుపుదామని అంతా అనుకున్నారు. అయితే దాదాపుగా ఆరు నెలల నుంచి అదే పరిస్థితి ఉండడంతో వర్క్ ఫ్రమ్ హోమ్.. ఇప్పుడు కాస్త ఇబ్బందిగానే మారింది. గతంలో ఆఫీసుకు వెళితే టీ బ్రేక్, లంచ్ బ్రేక్ అంటూ కాస్త విరామం దొరికేది. ఒకసారి పనివేళలు ముగిసి ఇంటికి వస్తే ఇక ఏ గోల ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఉండేది ఎలాగు ఇంట్లోనే కదా.. అని
కంపెనీలు అదనంగా పని కల్పిస్తున్నాయి. మొదట్లో ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకుంటూ సరదాగా పని చేసుకున్నా.. రానురాను తీరికలేని పనులతో గడపాల్సి రావడం మొదలైంది. ఇప్పుడు పని చేసుకునే సమయంలో ఇంట్లో వాళ్లు కూడా ఏదో ఒక పని చేసి పెట్టమని కోరుతుండటం ఇబ్బందిగా మారింది. రోజంతా జూమ్ లో మీటింగ్ లు, క్లయింట్లతో ఫోన్లో మాట్లాడాల్సి వస్తోంది. బాగా మీటింగ్ జరిగే సమయంలో పిల్లలు ఆడుకుంటూ రావడమో.. ఇంట్లోవాళ్లు డిస్టర్బ్ చేయడమో జరుగుతోంది. దీంతో ఉద్యోగులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి దాకా పనిభారం ఉంటోంది. గతంలో ఏదో ఒక పేరు చెప్పి సెలవులు పెట్టి ఇంటికి వచ్చే అవకాశం ఉండేది. ఇప్పుడు ఉండేది ఇంట్లోనే కదా.. సెలవు ఎందుకు అని చెప్పి కంపెనీలు ప్రశ్నిస్తున్నాయి. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉద్యోగులు ఉన్నారు. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు మరీ కష్టంగా మారింది. వర్క్ ఫ్రమ్ హోమ్.. కంటే మామూలుగా ఆఫీస్ కి వెళ్లి పని చేసుకోవడమే మేలని వారంటున్నారు. సెలవుల సంగతి అటుంచితే వీక్లీ ఆఫ్ లు కూడా ఇవ్వకుండా పని చేయించుకుంటున్నారని
.. వర్క్ ఫ్రమ్ హోమ్ తో గతంతో పోలిస్తే ఒత్తిడి పెరిగి పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.