Begin typing your search above and press return to search.

మ‌హిళ‌పై బ‌ల‌త్కార‌య‌త్నం..ఉద్యోగి అరెస్ట్‌

By:  Tupaki Desk   |   13 Jan 2018 7:18 AM GMT
మ‌హిళ‌పై బ‌ల‌త్కార‌య‌త్నం..ఉద్యోగి అరెస్ట్‌
X
ఓ మ‌హిళ‌తో అస‌భ్య‌క‌ర రీతిలో ప్ర‌వ‌ర్తించిన గూగుల్ ఉద్యోగి - ప్రవాస భార‌తీయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోట‌ల్‌ లో అమెరికాకు చెందిన ఓ మ‌హిళను బ‌ల‌త్కారం చేసేందుకు ఆయ‌న ప్ర‌వ‌ర్తించిన‌ట్లు పోలీసులు ఈ కేసు న‌మోదు చేశారు.

ఢిల్లీ అడిషిన‌ల్ క‌మిష‌న‌ర్ ఆఫ్ పోలీస్ బీకే సింగ్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం కాలిఫోర్నియాలో నివ‌సిస్తున్న ప్ర‌వాస భార‌తీయుడైన 22 ఏళ్ల అన్మోల్ సింగ్ క‌ర్బందా జ‌న‌వరి 8న రాత్రి ప‌ది గంట‌ల స‌మ‌యంలో హోట‌ల్‌ లోని బార్‌ లో 52 ఏళ్ల అమెరిక‌న్ మ‌హిళ‌లను క‌ల‌సుకున్నారు. అనంత‌రం త‌న‌ను తాను ప‌రిచ‌యం చేసుకొని ఆమెతో క‌లిసి మద్యం సేవించాల‌నుకున్న విష‌యాన్ని తెలియ‌జేశాడు. ఆమెతో క‌లిసి మ‌ద్యం - ధూమ‌పానం చేశారు. అనంత‌రం హోట‌ల్‌ లోని త‌న గదికి ఆమెను ఆహ్వానించాడు. ఈ సమ‌యంలోనే ఆమెతో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించేందుకు ప్ర‌య‌త్నించ‌గా..ఆయ‌న్ను తోసివేసి గ‌దిలో నుంచి బ‌య‌ట‌కు పరిగెత్తింది.

అనంత‌రం ఆ రాత్రి అంతా హోట‌ల్‌ లోని త‌న గ‌దిలో బిగ్గ‌ర‌గా గ‌డియ వేసుకొని ఉన్న ఆ మ‌హిళ మ‌రుస‌టి త‌న‌కు జైపూర్‌ లో ఉన్న స‌మావేశానికి హాజ‌రై సాయంత్రం తిరిగి ఢిల్లీ చేరింది. జైపూర్ నుంచి వ‌చ్చిన అనంత‌రం ఢిల్లీలోని చాణక్య‌పూరి హోట‌ల్‌ లో ఫిర్యాదుచేసింది. దీంతో `ఐపీసీ 354 - 328 ప్ర‌కారం మేం ఎఫ్ ఐఆర్ న‌మోదు చేశాం. న్యాయ‌మూర్తి ముందు ఆమె వాంగ్మూలాన్ని తీసుకున్నాం` అని ఆ పోలీస్ అధికారి వివ‌రించారు.

`అయితే బాధితురాలి ఫిర్యాదు స‌హా ఇత‌ర అంశాల గురించి అవ‌గాహ‌న లేని క‌ర్బాందా గుర్గావ్‌ లోని గూగుల్ ఇండియా ఆఫీసుకు వెళ్లారు. అనంత‌రం తొమ్మిదో తేదీన ఆయ‌న తిరిగి హోట‌ల్‌ కు చేర‌గా సెక్యురిటీ సిబ్బంది ఇచ్చిన స‌మాచారంతో ఆయ‌న్ను అరెస్టు చేశాం` అని ఏసీపీ వివ‌రించారు. కాగా ఆ తేదీ నుంచి ఆయ‌న జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీలో ఉన్నారు.