Begin typing your search above and press return to search.
న్యూయార్క్‌లో ఎన్నారై దారుణ హత్య !
By: Tupaki Desk | 21 May 2021 6:30 AM GMTఅమెరికాలోని న్యూయార్క్ లో గుజరాత్ రాష్ట్రానికి చెందిన 33 ఏళ్ల వ్యక్తి గురువారం దారుణ హత్యకి గురై , మృతి చెందాడు. ఒక చిన్న కారణానికి అతని పై నలుగురు విచక్షణా రహితంగా దాడి చేయడం తో అతడు తీవ్ర గాయాల పాలై , ఆస్పత్రికి తీసుకువెళ్తున్న సమయంలో అంబులెన్స్ లో మార్గ మద్యంలోనే మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే .. న్యూయార్క్ లోని లిండెన్ హార్ట్స్ లో గుజరాత్ రాష్ట్రం ఆనంద్ జిల్లా భద్రన్ నగరానికి చెందిన కింషుక్ పటేల్ అనే ఎన్నారై డాపర్ స్మోక్ షాప్ నడుపుతున్నాడు. అమెరికా టైమింగ్ ప్రకారం .. బుధవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో షాపు మూసివేసి ఇంటికి బయల్దేరడానికి రెడీ అవుతున్నాడు.
అయితే , సరిగ్గా అదే సమయంలో నలుగురు వ్యక్తులు కింషుక్ షాపునకు వెళ్లారు. తమకు కొన్ని వస్తువులు కావాలని అడగడం తో షాప్ మూసివేసే టైం అయిందని, ఇప్పుడు ఇవ్వడం కుదరదని వారితో చెప్పుకొచ్చాడు. దీనితో ఆ నలుగురు కింషుక్ ను విచక్షణరహితంగా కొట్టి, వారికి కావాల్సినవి తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయడిన కింషుక్ స్పృహ కోల్పోయాడు.
అయితే , రోజూ ఇంటికి సరైన సమయానికి తిరిగి వచ్చే కింషుక్ రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేశారు. కానీ, కింషుక్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దాంతో అతడి మిత్రుడు అంకూర్ పటేల్ కు ఫోన్ చేసి విషయం చెప్పారు. వారి సమాచారంతో అంకూర్ వెంటనే కింషుక్ షాపుకివెళ్లాడు. అక్కడికి వెళ్లి చూడగా షాపు తెరిచే ఉంది. లోపలికి వెళ్లి చూస్తే తలపై తీవ్ర గాయాలతో కింషుక్ రక్తపు మడుగులో అచేతనంగా పడి ఉన్నాడు. వెంటనే ఈ విషయాన్ని కింషుక్ కుటుంబ సభ్యులకు తెలియజేసిన అంకూర్.. హూటాహూటిన అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశాడు. కానీ, అప్పటికే చాలా రక్తం పోవడంతో మార్గం మధ్యలోనే కింషుక్ కన్నుమూశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. కింషుక్ భార్య, ఇద్దరు పిల్లలు, తన తండ్రితో న్యూయార్క్‌లో ఉంటున్నట్లు అంకూర్ చెప్పాడు.