Begin typing your search above and press return to search.
అమెరికాలో భారతీయ దంపతుల కాల్చివేత
By: Tupaki Desk | 6 May 2017 7:16 AM GMTఅమెరికాలో మరో దుర్ఘటన చోటు చేసుకుంది. అమెరికాలో భారతీయ సంతతి దంపతులు కాల్చివేతకు గురయ్యారు. జునిపుర్ నెట్ వర్క్స్ వైస్ ప్రెసిడెంట్ నరేష్ ప్రభు - అతని భార్యను మీర్జా తాత్లిక్(24) అనే వ్యక్తి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. అనంతరం మీర్జాను పోలీసులు కాల్చిచంపారు. నరేష్ ప్రభు కుమార్తె రాచెల్ ప్రభుకు మీర్జా తాత్లిక్ మాజీ ప్రియుడు అని కుటుంబసభ్యులు తెలిపారు.
మీర్జా తాత్లిక్ తమ ఇంట్లోకి ప్రవేశించి తన తల్లిదండ్రులను నిర్బంధించినట్లు వారి పెద్ద కుమారుడు శాన్ జోస్ పోలీసులకు సమాచారమిచ్చాడు. దీంతో వెంటనే పోలీసులు లారా విల్లీ లైన్ లోని బాధితుల ఇంటికి చేరుకున్నారు. అయితే నరేన్ దంపతులతో సహా 16 ఏళ్ల వారి చిన్న కుమారుడిని మీర్జా గదిలో బంధించాడు. లోపలకి రావొద్దని పోలీసులను బెదిరించాడు. అయినప్పటికీ పోలీసులు ముందుకు వెళ్లడంతో తొలుత చిన్న కుమారుడిని విడిచి పెట్టాడు. అదే అదునుగా భావించిన పోలీసులు తలుపులు తోసుకుని లోపలికి వెళ్లేసరికి నరేన్ దంపతులు విగతజీవులుగా పడి ఉన్నారు. 2016 వరకూ మీర్జా-రాచెల్ లు డేటింగ్ లో ఉన్నారనీ, గత ఏడాదిగా వారిద్దరూ విడిపోయారు. అయినప్పటికీ రాచెల్‌ను మీర్జా వేధిస్తున్నాడని నరేన్ పెద్ద కుమారుడు పోలీసులకు వివరించాడు. సామాజిక మాధ్యమాల్లో తన సోదరికి సందేశాలు, దూషణపూరితమైన వ్యాఖ్యలు పంపేవాడని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో తాజాగా ఇలా దాడికి పాల్పాడ్డాడని తెలిపాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/