Begin typing your search above and press return to search.

యువతిని మతం మార్పించి..ముఖం చాటేశాడు..

By:  Tupaki Desk   |   29 Sep 2018 10:48 AM GMT
యువతిని మతం మార్పించి..ముఖం చాటేశాడు..
X
ఓ హైదరాబాదీ ముస్లిం యువకుడు.. పైగా సాఫ్ట్ వేర్ ఇంజినీర్.. 2012 నుంచి ఇక్కడే పనిచేశాడు. అనంతరం లక్షల జీతం ఆఫర్ రావడంతో దుబాయ్ వెళ్లిపోయాడు. అక్కడ 2014 నుంచి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు.. అప్పటికే తనకు పరిచయమైన హిందూ యువతిని నమ్మించి దుబాయ్ తీసుకెళ్లాడు. అక్కడ ఉద్యోగం ఇప్పించాడు. ఆ తర్వాత మతం మారితే పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. హైదరాబాద్ వచ్చి విడిచిపెట్టి వెళ్లిపోయాడు.. మోసపోయానని నమ్మిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మల్కాజిగిరి పరిధిలోని దారుల్ ఫిషాకు చెందిన సఫ్దర్ అబ్బాస్ జైదీ (28) దుబాయ్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. దుబాయ్ వెళ్లకముందుకు హైదరాబాద్ లో ఓ హిందూ యువతిని ప్రేమించాడు. అనంతరం దుబాయ్ కి ఆ అమ్మాయిని రప్పించి ఉద్యోగంలో చేర్పించాడు. వివాహం చేసుకుంటానని మతం మారాలని షరతు పెట్టాడు. దానికి ఓకే చెప్పిన యువతి ప్రియుడితో కలిసి హైదరాబాద్ వచ్చేసింది. ఏప్రిల్ 17న పెళ్లి చేసుకుందామని చెప్పి యువతిని జైదీ నమ్మించాడు. అనంతరం చెప్పా పెట్టకుండా దుబాయ్ కి చెక్కేశాడు. మాట్లాడడం మానేశాడు.. మోసపోయానని గ్రహించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

జైదీ దుబాయ్ లో ఉండడంతో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ నిందితుడిపై లుక్ అవుట్ సర్టిఫికెట్ జారీ చేశాడు. అతడు ఎప్పుడు వచ్చినా అరెస్ట్ చేయాలని శంషాబాద్ పోలీసులకు ఆదేశాలిచ్చాడు. ఆ సమయం రానే వచ్చింది. ఈ నెల 27న హైదరాబాద్ వచ్చిన అబ్బాస్ జైదీని ఎయిర్ పోర్టు పోలీసులు పట్టుకొని మల్కాజిగిరి పోలీసులకు అప్పగించారు. విచారణలో నేరం అంగీకరించడంతో శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. ఇలా యువతిని మోసం చేసిన పాపానికి ప్రియుడు బుక్కై ప్రస్తుతం కటకటాల పాలయ్యాడు.