Begin typing your search above and press return to search.
తెలుగు ఎన్నారై ఆత్మహత్య..భార్య ఆవేదన ఇది
By: Tupaki Desk | 12 April 2017 1:19 PM GMTతెలుగు ఎన్నారై మధుకర్ రెడ్డి అమెరికాలో ఆత్మహత్య చేసుకునేందుకు ఆయన భార్య స్వాతి కారణం అంటూ మధుకర్ కుటుంబ సభ్యులు ఆరోపించిన ఉదంతం కలకలం రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని కొత్తపేటలో తన ఇంట్లో మీడియాతో మాట్లాడిన స్వాతి తన భర్త మృతికి తాను కారణం కాదని వెల్లడించింది. ఆర్థిక వ్యవహారాలు, మానసిక ఒత్తిడితోనే తన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడని వివరణ ఇచ్చింది. తన భర్త మధు చాలా మంచివాడని తెలిపింది. అయితే ఒక్కోసారి డిప్రెషన్ కు లోనై తనను అప్పుడప్పుడు తనను కొడుతుండేవాడని, ఆ తర్వాత తప్పైపోయిందని అనేవాడని అయితే ప్రతిసారీ ఇలా చేస్తుండటంతో ఒకానొక దశలో మధుకర్‌ను తానే నిలదీసినట్టు తెలిపింది. కేవలం ఈ విషయంలో తప్ప భర్తతో తనకు ఎలాంటి విబేధాల్లేవని స్వాతి స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా చివరిసారి మధుకర్ తనతో మాట్లాడిన సంభాషణను మీడియాకు స్వాతి వినిపించింది. మధుకర్ ఆత్మహత్య చేసుకున్న రోజున (ఏప్రిల్ 3న) ఆయన కొంత డిప్రెషన్‌లో ఉన్నారని, వీసా పొడిగింపు, ఉద్యోగం పోతుందనే భయంతో ఆందోళనకు గురయ్యారని తెలిపింది. తాను ఉదయం ఏడు గంటలకే ఆఫీసుకు వెళ్లానని, లంచ్ బాక్స్ కూడా మధుకరే ఇచ్చారని తెలిపింది. మధుకర్ తన బంధువులకు సుమారు రూ.70లక్షల వరకు అప్పులు ఇచ్చాడని వెల్లడించిన స్వాతి ఈ విషయంలో కూడా ఆయన కొంత ఆందోళనలో ఉన్నారని తెలియజేసింది. ఈ సందర్భంగా తన అత్తామామల ప్రవర్తనను స్వాతి తప్పుపట్టింది. జనగామ్‌లో మధుకర్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్తే, అత్తమామలు తనను అడ్డుకున్నారని, తన భర్త శవం ఉండగానే తనపై దాడి చేశారని వాపోయింది. కేవలం అపోహల ఆధారంగా ఇలా చేయడం ఏమిటని ప్రశ్నించింది. తనకు తన కూతురుకు భద్రత కల్పించాలని ఈ సందర్భంగా స్వాతి పోలీసులను కోరింది.. ఈనెల నాలుగున మధుకర్‌రెడ్డి కాలిఫోర్నియాలో ఉరేసుకున్న సంగతి తెలిసిందే!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/