Begin typing your search above and press return to search.

సూసైడ్ ఎన్నారై భార్య ఆత్మ‌హ‌త్య‌య‌త్నం

By:  Tupaki Desk   |   14 April 2017 11:14 AM GMT
సూసైడ్ ఎన్నారై భార్య ఆత్మ‌హ‌త్య‌య‌త్నం
X
అమెరికాలో ఉద్యోగం చేస్తున్న సూసైడ్ చేసుకున్న ఎన్‌ ఆర్‌ ఐ మధుకర్‌ రెడ్డి కుటుంబంలో మ‌రో దుర‌దృష్ట‌క‌ర సంఘ‌ట‌న చోటుచేసుకుంది. మ‌ధుక‌ర్ రెడ్డి భార్య స్వాతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కొత్తపేట సౌభాగ్యపురంలోని తన అమ్మ‌వాళ్లింట్లో హార్పిక్ ద్రావణం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. స్వాతిని తల్లిదండ్రులు కొత్తపేట ఆస్పత్రికి తరలించారు. ప్ర‌స్తుతం ఆమెకు చికిత్స కొన‌సాగుతోంది.

ఎన్నారై మధుకర్‌ రెడ్డి కొద్ది రోజుల క్రితం అక్కడే ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన మృతదేహం ఇటీవలే స్వగ్రామానికి చేరుకోగా కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. మధుకర్‌ రెడ్డి ఆత్మహత్యకు ఆయన భార్య కారణమని అంత్యక్రియలకు వెళ్లిన స్వాతి - ఆమె తండ్రిని మధుకర్‌ రెడ్డి తరపు బంధువులు అడ్డుకుని దాడి చేశారు. మూడు రోజుల క్రితం మీడియా సమావేశం నిర్వహించిన స్వాతి తన భర్త ఆత్మహత్యకు తాను కారణం కాదని, ఆర్థిక ఒత్తిళ్లు - మానసిక ఆందోళనతోనే ఆయన అఘాయిత్యానికి పాల్పడ్డాడని తెలిపింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/