Begin typing your search above and press return to search.

త‌మ్ముళ్ల‌కు షాకిచ్చిన లోకేశ్ స‌ర‌దా వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   5 Feb 2018 4:56 AM GMT
త‌మ్ముళ్ల‌కు షాకిచ్చిన లోకేశ్ స‌ర‌దా వ్యాఖ్య‌లు
X
స‌ర‌దాకు ఒక హ‌ద్దు ఉంటుంది. ఇవాల్టి రోజున ఉన్న ప‌రిస్థితికి మాట్లాడే ప్ర‌తి మాట ఆచితూచి అన్న‌ట్లు ఉండాలి. ఎక్క‌డా.. ఎవ‌రూ ఎలాంటి వంక పెట్ట‌ని రీతిలో మాట‌లు ఉండాలి. అలా అని ప‌ట్టి ప‌ట్టి మాట్లాడినా బాగుండ‌దు. స‌హ‌జ‌సిద్దంగా మాట్లాడిన‌ట్లు క‌నిపించినా.. అలెర్ట్ నెస్ చాలా ముఖ్యం. కానీ.. ఇలాంటి తీరు ఎక్క‌డా క‌నిపించ‌దు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కుమారుడు.. ఏపీ మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్న నారా లోకేశ్‌ లో.

ఇప్ప‌టికే ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల మీద ఆన్ లైన్లో చాలానే జోకులు వైర‌ల్ అయ్యాయి. చిన‌బాబు మాట‌లు కామెడీగా మారిన వైనాన్ని మ‌ర్చిపోకూడ‌దు. చిన‌బాబు మాట్లాడుతున్నారంటే చాలు.. కెమేరాలు నాన్ స్టాప్ గా ప‌ని చేస్తూనే ఉంటాయి. ఎప్పుడేం మాట్లాడ‌తారో తెలీని నేప‌థ్యంలో ఆణిముత్యాల్లా లోకేశ్ నోటి నుంచి జాలువారే మాట‌ల్ని మిస్ కాకూడ‌ద‌న్న‌ట్లుగా మీడియా అలెర్ట్ గా ఉండ‌టం క‌నిపిస్తుంది.

ఇంత జ‌రుగుతున్నా లోకేశ్ జాగ్ర‌త్త‌గా ఉండ‌టం లేద‌న్న మాట తెలుగుత‌మ్ముళ్ల నోటి నుంచి వినిపిస్తోంది. చిన‌బాబు మాట్లాడే మాట‌ల‌తో త‌ర‌చూ ప‌లుచ‌న అవుతామ‌న్న ఆక్రోశాన్ని వారు వ్య‌క్తం చేస్తుంటారు. విష‌యాల‌పై అవ‌గాహ‌న పెంచుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. భ‌విష్య‌త్ నేత‌గా ఎద‌గాల‌నుకునేట‌ప్పుడు జాగ్ర‌త్త అవ‌స‌ర‌మ‌ని చెబుతున్నారు. చిన‌బాబులో లోపిస్తున్న అంశాల్ని స‌రిదిద్దే ప‌నిని చంద్ర‌బాబు ప్ర‌త్యేకంగా చేప‌ట్టాల‌న్న సూచ‌న‌లు చేస్తుంటారు.

కానీ.. ఇవేమీ జ‌ర‌గ‌టం లేద‌న్న విష‌యం తాజాగా లోకేశ్ చేసిన వ్యాఖ్య‌ల్ని చూస్తే మ‌రోసారి అర్థం కాక మాన‌దు. తాజాగా అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న లోకేశ్ న్యూజెర్సీలో జ‌రిగిన ఎన్నారై టీడీపీ మీటింగ్‌ కు హాజ‌ర‌య్యారు. పార్టీ కార్య‌క‌ర్త‌ల్ని ఉద్దేశించి ప్ర‌సంగించారు. అమెరికాలో నిర్వ‌హించిన పార్టీ స‌మావేశానికి పెద్ద ఎత్తున హాజ‌రైన కార్య‌క‌ర్త‌ల్ని చూసినంత‌నే లోకేశ్ ఒళ్లు పుల‌క‌రించిందేమో కానీ.. స‌ర‌దా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు తెలుగు త‌మ్ముళ్లు నోరెళ్ల‌బెట్టేలా చేసింది. ఇంత‌కీ ఆయ‌న నోటి నుంచి వ‌చ్చిన మాటేమిటంటే.. మీ ఉత్సాహం చూస్తుంటే అమెరికాలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌నిపిస్తోంద‌ని వ్యాఖ్యానించేశారు.

కార్య‌క‌ర్త‌ల్లో ఉత్సాహం ర‌గ‌ల్చ‌టానికి కీల‌క నేత‌లు చాలా మాట‌లు చెబుతుంటారు. ఆ సంద‌ర్భంగా కొన్ని అతిశ‌యోక్తులు వ‌స్తుంటాయి. కానీ.. లోకేశ్ మాదిరి ఈ స్థాయిలో అతిశ‌యోక్తులు మాట్లాడ‌టం ఎవ‌రి వ‌ల్లా కాదంటున్నారు. గుప్పెడు మంది పార్టీ కార్య‌క‌ర్త‌లు క‌నిపించింనంత‌నే దేశం కాని దేశంలో ఇలా నోటికి వ‌చ్చిన‌ట్లు మాట్లాడ‌టం స‌బుబేనా? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఇక‌.. ఈ స‌మావేశానికి హాజ‌రైన పార్టీ కార్య‌క‌ర్త‌ల ప‌రిస్థితి అయితే చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. చిన‌బాబు మాట‌ల‌తో వారి ముఖంలో ర‌క్తం చుక్క క‌నిపిస్తే ఓట్టు. లోకేశ్ ప్ర‌సంగానికి ముందున్న ఉత్సాహం.. ఆయ‌న మాట‌ల‌తో నీర‌సాన్ని తెప్పించింద‌ని చెబుతున్నారు. ఎంత అతిశ‌యోక్తి అయితే మాత్రం అమెరికాలో టీడీపీ అధికారంలోకి రావ‌టం లాంటి క‌ల చిన‌బాబుకే సాధ్య‌మేమో?