Begin typing your search above and press return to search.

నోట్ల మార్పిడికి వాళ్లకు జూన్ 30 వరకు ఛాన్సు

By:  Tupaki Desk   |   1 Jan 2017 7:08 AM GMT
నోట్ల మార్పిడికి వాళ్లకు జూన్ 30 వరకు ఛాన్సు
X
పాత నోట్లు మార్చుకోవడానికి గడువు ఎప్పటి వరకు ఉంది...? డిసెంబరు 30తో అయిపోయింది.. ఆర్బీఐ వద్ద అయితే మార్చి వరకు టైముంది. కానీ.. విదేశాల్లో ఉన్న ఇండియన్సుకు మాత్రం మరో మూడు నెలల అదనపు టైమిచ్చారు. విదేశాల్లో ఉంటున్న భారతీయులు పాత నోట్లను మార్చుకునే గడువును పొడిగిస్తూ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శనివారం రాత్రి ఉత్తర్వులను వెలువరించింది. వీరికి జూన్ 30 వరకూ గడువిచ్చింది. నోట్ల రద్దు ప్రకటించిన నవంబర్ 9 నుంచి గడువు ముగిసిన డిసెంబర్ 30 మధ్య విదేశాల్లో ఉన్న వారు ఈ అవకాశాన్ని వాడుకోవచ్చు. దీనికి సంబంధించి అన్ని పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చింది ఆర్బీఐ.

విదేశాల్లో ఉన్న భారతీయ పౌరులు (రెసిడెంట్‌ ఇండియన్స్) ఎంత మొత్తంలోనైనా నగదును మార్చుకోవచ్చు. అర్హులైన భారత పౌరులకు పరిమితులు లేవని, ఎన్నారై (నాన్ రెసిడెంట్ ఇండియన్స్) కు మాత్రం ఫెమా చట్టం వర్తిస్తుందని ఆర్బీఐ తెలిపింది. ఫెమా నిబంధనల ప్రకారం రూ. 25 వేల వరకూ నగదును మార్చుకోవచ్చు. వీరంతా గుర్తింపు డాక్యుమెంట్లతో పాటు - నవంబర్ 9 నుంచి డిసెంబర్ 30 వరకూ విదేశాల్లో ఉన్నట్టు, తమ ఖాతాల్లో డబ్బు జమ చేసుకోలేదన్న ఆధారాలను చూపించాల్సి ఉంటుంది.

అంతేకాదు.. నోట్లు మార్చుకోవాలంటే స్వయంగా స్వయంగా బ్యాంకులకు వచ్చి డబ్బును డిపాజిట్ చేసుకోవాలి. తమ తరఫున ఇతరులు వస్తే కుదరదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/