Begin typing your search above and press return to search.
ఎన్నారైలు.. తమ పిల్లలను వదిలేసి రావాల్సిందే
By: Tupaki Desk | 16 May 2020 8:50 AM GMTమన చట్టాలు.. నిబంధనలు అలా ఏడ్చాయి మరీ.. కన్నతల్లిదండ్రులను, పిల్లలను విడదీసేస్తున్నాయి. అమెరికాకు వెళ్లిన ప్రవాస భారతీయులను ఇండియాకు రావడానికి కేంద్రం ‘వందే భారత్ మిషన్’ పేరిట విమానాలను ఏర్పాటు చేసింది. అయితే ఎన్నారైలు రావడానికి ఓకే చెప్తున్న కేంద్రం.. వారి పిల్లలకు మాత్రం నో చెబుతోంది. ఇదేంటి అంటే.. ఎన్నారైల పిల్లలు అమెరికా లో పుట్టడంతో వారు విదేశీయులుగా ముద్ర పడ్డారు. అమెరికా జాతీయత ఉండడం తో భారత విమానం ఎక్కడానికి వీలు లేకుండా పోయింది. దీంతో తమ పిల్లలను అమెరికాలో వదిలి తాము ఎలా వస్తామంటూ ఎన్నారైలు ఆందోళన చేస్తున్నారు.
అమెరికాలో జన్మించిన పిల్లలను కలిగి ఉన్న భారతీయ-అమెరికన్లు, హెచ్ -1 బి హోల్డర్లు లేదా గ్రీన్ కార్డ్ హోల్డర్లు ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించడానికి అనుమతించడం లేదు. ఈ డ్రైవ్ అమెరికాలో చిక్కుకుపోయిన ‘భారతీయులను’ మాత్రమే తిరిగి తీసుకు రావడానికి ఉద్దేశించబడింది. ఇది అమెరికాలో జన్మించిన వారి పిల్లల కోసం కాదు. భారత ప్రభుత్వం విధించిన ఈ నిబంధనలతో అమెరికాలో చాలా మంది భారతీయ కుటుంబాల వారు.. తమ పిల్లలను వదిలేసి ఇండియాకు రావాల్సి ఉంటుంది. దీంతో తల్లిదండ్రులు కూడా తాము పిల్లలను వదిలి రామని ఖరాఖండిగా చెబుతున్నారు.
కరోనావైరస్ నేపథ్యంలో అత్యంత తీవ్రమైన పరిస్థితుల్లో ఉన్న వారిని మాత్రమే భారత్ కు మొదట పంపిస్తున్నారు. పరిమిత విమానాలను మాత్రమే ఎయిర్ ఇండియా నడుపుతోంది. ఎంపికలో కఠినమైన విధానాలు పాటిస్తున్నారు. అవసరమైన వారు మరియు అర్హత ఉన్నవారు మొదట ప్రయాణించగలరు. ఈ స్వదేశానికి తిరిగి పంపే విమానాల్లో ఏ విదేశీ పౌరులను, ఓసీఐ కార్డుదారులను అనుమతించడం లేదు.
అమెరికాలో హెచ్ -1 బి వీసాపై ఉన్న చాలా మంది భారతీయులకు ఇది తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.వారు ఇప్పటికే ఉద్యోగాలు కూడా కోల్పోయారు. వీరంతా 60 రోజుల లోపు భారతదేశానికి తిరిగి వెళ్లాల్సి వచ్చింది. కానీ అమెరికాలో జన్మించిన పిల్లలను కలిగి ఉన్నవారికి ఓసీఐ కార్డు దారులకు భారత విమానాలు ఎక్కేందుకు అనుమతించడం లేదు. ఇదే ఎన్నారై కుటుంబాలకు శాపంగా మారింది.
అమెరికాలో చిక్కుకున్న భారతీయ-అమెరికన్లు ఈ నిర్ణయాన్ని పున పరిశీలించాలని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అదే సమయంలో, ఉద్యోగం కోల్పోయిన తర్వాత అమెరికాలో ఉండాల్సిన పరిమితిని 60 రోజుల నుండి 180 రోజులకు పొడిగించాలని అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.