Begin typing your search above and press return to search.
షా-జూనియర్‌ల భేటీ.. తెర వెనుక చక్రం తిప్పిందెవరు?
By: Tupaki Desk | 22 Aug 2022 5:30 PM GMTతాజాగా జూనియర్ ఎన్టీఆర్‌తో బీజేపీ అగ్రనేత.. అమిత్ షా భేటీ అయ్యారు. హైదరాబాద్లోని నోవాటెల్ హో టల్‌లో సుమారు 45 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో అమిత్‌షాను జూనియర్ సత్కరిం చారు. అదేసమయంలో జూనియర్‌ను కూడా అమిత్ షా ప్రశంసించారు. అనంతరం.. 20 నిమిషాల పాటు.. ఇద్ద రూ ఏకాంతంగా చర్చించుకున్నారు. తర్వాత.. డిన్నర్ తీసుకున్నారు. కట్ చేస్తే.. అసలు జూనియర్‌తో అమిత్ షా భేటీ కావాలనే విషయం.. అసలు తెరమీదికి ఎలా వచ్చింది..? ఎందుకు ఈ భేటీ ఏర్పాటు చేశారు? దీని వెనుక ఎవరు ఉన్నారు? అనేది ఆసక్తిగా మారింది.
ఈ విషయంపై ఇప్పటికే అనేక విశ్లేషణలు వస్తున్నాయి. హైదరాబాద్‌లోని ఏపీ సెటిలర్లను తమవైపు తిప్పుకొనే వ్యూహంలో భాగంగానే బీజేపీ ఇలా.. జూనియర్‌ను రంగంలోకి దింపిందనే వాదన ప్రధానంగా వినిపిస్తోంది. రాజకీయంగా దీనికి ఉన్న ప్రాధాన్యాన్ని పక్కన పెడితే.. అసలుఈ సమావేశానికి ఎవరు సహకరించారు? అనేది ఆసక్తిగా మారింది. రాజకీయంగా ఎవరూ కూడా జూనియర్‌ను దీనికి ఒప్పించే సాహసం చేయలేరు. ఇక, జూనియర్ కూడా పెద్దగా ఇంట్రస్ట్ చూపించరు.
అయితే.. సినిమా బ్యాక్‌గ్రౌండ్ నుంచే జూనియర్-షాల భేటీకి కథనడిచిందని అంటున్నారు. ఈ సమావేశానికి ముందే ఎన్టీఆర్‌కు సమాచారం అందించారు. సమావేశంలో తలెత్తే సమస్యలను కూడా ఆయనకు వివరించారని సమాచారం. మూలాధారాలను విశ్వసిస్తే, ఈ సమావేశాన్ని సులభతరం చేయడంలో ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషించారనే గుసగుస వినిపిస్తోంది. ప్రస్తుతం ఈయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.
సినీ ఫీల్డ్‌లో ఎన్టీఆర్ ఎప్పటికీ నో చెప్పలేని వ్యక్తి విజయేంద్ర ప్రసాద్. ఆయన రాసిన అనేక కథల్లో ఎన్టీఆర్ విజయాన్ని అందుకున్నారు. దీంతో ఆయన మాటను తీసేసే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అమిత్ షాను కలిసేందుకు ఎన్టీఆర్ అంగీకరించినట్టు గుసగుస వినిపిస్తోంది. అందుకే ఆ సభకు ఎన్టీఆర్ అంగీకరించేలా విజయేంద్ర ప్రసాద్‌ను బీజేపీ ఉపయోగించుకుందని కూడా అంటున్నారు. ఈ దశలో ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వరని కచ్చితంగా చెప్పినప్పటికీ, తెలంగాణలోని పెద్ద సెటిలర్ వర్గాలకు ఈ భేటీ స్పష్టమైన సంకేతాలు పంపుతుందని అంతా భావిస్తున్నారు.
షా-జూనియర్‌లను ఇద్దరినీ ఒకచోట చేర్చడంలో విజయేంద్ర ప్రసాద్‌ది కీలకపాత్రగా భావిస్తున్నారు. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం తరపున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశారు. ఆయన ప్రసంగాలు, వ్యవహారశైలి హిట్ అయ్యాయి. ఎన్నికల్లో టీడీపీ గెలవకపోయినా మరే నాయకుడూ లేనంతగా వెలిగిపోయాడు. అయితే అప్పటి నుంచి టీడీపీ అగ్రనేత ఆయనకు దూరంగానే ఉన్నారు. దూరమైన ఎన్టీఆర్ అప్పటి నుంచి రాజకీయాలు మాట్లాడడం లేదు. అమిత్ షాతో ఆయన తాజా భేటీ ఎన్టీఆర్ భవిష్యత్తు ఎత్తుగడలపై ఊహాగానాలు పెంచాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.