Begin typing your search above and press return to search.
బాలయ్య సామంతరాజ్యంలో ఇష్టారాజ్యమా!
By: Tupaki Desk | 7 Sep 2016 4:02 AM GMTవిజయవాడలో రోడ్డు పనులు జరుగుతున్నాయంటూ.. రోడ్డు మధ్యలో ఉన్న మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని అమానుషంగా తొలగించేసినప్పుడు ప్రభుత్వంలోని పెద్దలంతా ఏం చెప్పారో ఓసారి గుర్తు చేసుకోండి. ఎలా పడితే అలా ఎవరికి నచ్చినట్లు వాళ్లు విగ్రహాలు పెట్టుకోడానికి వీల్లేదు. రాష్ట్రంలో ఎక్కడా ఇకమీదట విగ్రహాలు పెట్టడానికి అనుమతులు ఇచ్చేది లేదు. అనుమతుల్లేని విగ్రహాలను తొలగించడానికి కూడా వెనుకాడేది లేదు.. ఇలాంటి డైలాగులు లెక్కకు మిక్కిలిగా వచ్చాయి. కానీ తాజాగా వస్తున్న వార్తలను గమనిస్తోంటే.. ఈ ప్రగల్భాలు అన్నీ కేవలం ప్రతిపక్షం విషయంలో మాత్రమే ఏమోనని ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు.
ఎందుకంటే ఇప్పుడు అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యేగా తన సామంతరాజ్యాన్ని కలిగి ఉన్న నందమూరి బాలకృష్ణ అక్కడ ఇష్టారాజ్యంగా విగ్రహాలు ఏర్పాటుచేసేస్తున్నారా? అని జనానికి సందేహాలు కలుగుతోంది. హిందూపురంలో ఎమ్మెల్యేగా నందమూరి బాలయ్య హవా బీభత్సంగా నడుస్తుంటుంది. ఆయనకు తెలియకుండా అక్కడ చీమ చిటుక్కుమనే పరిస్తితి లేదని ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు.
అలాంటిది అక్కడ హిందూపురంలో ఒకటిన్నర కోట్ల రూపాయలతో 45 అడుగుల అతిపెద్ద ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఆలయ కమిటీ నిర్ణయించింది. ఆ నిర్ణయంలో ఎమ్మెల్యే బాలకృష్ణ తరఫు ప్రతినిధులు కూడా ఉండడం విశేషం. ఇది సాధారణంగా జరిగేదే.. అంత పెద్ద విగ్రహాన్ని అనుమతులతోనే పెడతారు.. పైగా ఆలయ ప్రాంగణాల్లో దేవుడి విగ్రహం పెట్టడంలో ఇబ్బందేముంటుంది అనుకోవచ్చు గానీ.. స్థానికులు అక్కడితో ఆగడం లేదు.
హిందూపురం సమీపంలోని సూరప్పకట్టపై నందమూరి తారకరామారావు - బసవతారకం - శ్రీకృష్ణదేవరాయలు విగ్రహాలను ఏర్పాటుచేస్తున్నారట. ఈ విషయాలను స్వయంగా అక్కడ ఎమ్మెల్యే సహాయకుడు శేఖర్ మీడియాకు వెల్లడించడం విశేషం. అచ్చంగా నందమూరి బాలయ్య ప్రసన్నానికే ఆయన తల్లిదండ్రుల విగ్రహాలు - ఆయనకు ఇష్టమైన కృష్ణదేవరాయల విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నట్లుగా ఉన్నదని.. విగ్రహాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వ నిబంధనలు ఇక్కడ పట్టించుకోరా అని జనం అనుకుంటున్నారు. కృష్ణదేవరాయలు విగ్రహం వరకు ఓకే గానీ.. నందమూరి తారక రామారావు - బసవతారకం విగ్రహాలు కావాలంటే.. ప్రెవేటు స్థలాల్లో పెట్టుకోవాలనే వాదన జనంలో వినిపిస్తోంది.