Begin typing your search above and press return to search.
బాబుకు రివర్స్ పంచ్ ఇచ్చిన నందమూరి బ్రదర్స్
By: Tupaki Desk | 17 Nov 2018 1:02 PM GMTతెలంగాణలో ముందస్తు ఎన్నికలు తెలుగుదేశం పార్టీలో ఆసక్తికరమైన పరిణామాలకు వేదికగా నిలుస్తున్నాయి. పలు అనూహ్య పరిణామాల తర్వాత కూకట్ పల్లి నుంచి నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినిని బరిలోకి దింపారు. అప్పటి వరకు ప్రచారంలో ఉన్న పెద్దిరెడ్డిని కాదని - సుహాసినికి టికెట్ ఇచ్చారు. ఆమెను బరిలోకి దింపడం వ్యూహాత్మకమేనని అంటున్నారు. సినీ నటుడు - టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో కలిసి ఆమె తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అయితే, ఈ సమయంలోనే నందమూరి కుటుంబంలో - తెలుగుదేశం పార్టీలో ఉన్న విబేధాలను చాటి చెప్పిందంటున్నారు.
నామినేషన్ ప్రకటన అనంతరం సుహాసిని మీడియాతో మాట్లాడుతూ తన ప్రచారానికి సోదరులు కళ్యాణ్ రామ్ - ఎన్టీఆర్ హాజరవుతారో చెప్పలేనని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే, ఊహించినట్లుగానే వారు హాజరు కాలేదు. అయితే వారు ఒక ప్రెస్ నోట్ విడదల చేశారు. ``ప్రజలే దేవుళ్లు - సమాజమే దేవాలయం అనే సిద్ధాంతంతో తమ తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీ మామకు ఎంతో పవిత్రమైంది. తమ తండ్రి హరికృష్ణ సేవలు అందించిన తెలుగుదేశం పార్టీ తరపున ఇప్పుడు సోదరి సుహాసిని పోటీ చేస్తున్నారు. సమాజంలో మహిళలు కూడా ఉన్నతమైన పాత్ర పోషించాలని నమ్మే కుటుంబం మాది. ప్రజాసేవకు సిద్దమవుతున్న సోదరి సుహాసినికి విజయం వరించాలి.`` అని ఆకాంక్షించారు.
ఈ పత్రికా ప్రకటన విడుదల చేసిన తీరులోనే తమకు టీడీపీతో పెద్దగా అనుబంధం లేదని, ఇంకా చెప్పాలంటే - సుహాసినిని బరిలో దింపాలనేది పార్టీకి సంబంధించిన నిర్ణయమే అన్నట్లుగా వారు పేర్కొన్నారు. అదే సమయంలో ఈ పత్రికా ప్రకటనలో ఎక్కడా తెలుగుదేశం పార్టీ అద్యక్షుడు చంద్రబాబు పేరును ప్రస్తావించకపోవడం - తాము ప్రచారానని వస్తామని హామీ ఇవ్వకపోవడం..తమ అభిమానులునోటు వేయాలని కోరకపోవడం చూస్తుంటే...నందమూరి కుటుంబంలో చీలిక స్పష్టమైందా అని పలువురు చర్చించుకుంటున్నారు.