Begin typing your search above and press return to search.
సుహాసిని పోటీ... వారికి నచ్చలేదట!
By: Tupaki Desk | 17 Nov 2018 3:14 AM GMTనందమూరి సుహాసిని... కాదు కాదు చుండ్రు సుహాసిని... ఇదేమిటీ రెండు ఇంటి పేర్లు చెబుతున్నారు అనుకుంటున్నారు. భారతీయ సంప్రదాయం ప్రకారం ఆడపిల్లకు పెళ్లి అయితే భర్త ఇంటి పేరే తన ఇంటి పేరుగా మారడం సంప్రదాయం. సంప్రదాయాలను - చట్టాలను సైతం తనకు అనుకూలంగా మార్చుకునే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సుహాసిని ఇంటి పేరును కూడా రాజకీయాల కోసం మార్చేశారని అంటున్నారు. అయితే తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి చుండ్రు సుహాసినిగా కాక నందమూరి సుహాసినిని బరిలో దింపారు చంద్రబాబు నాయుడు.
నందమూరి హరిక్రష్ణ కుమార్తె అయిన సుహాసినిని బరిలోకి దింపే ముందు ఆయన కుమారులు కల్యాణ్ రాం - నటుడు తారక రామారావులను పోటీ చేయమని అడిగారని - అయితే వారిద్దరు అంగీకరించకపోవడంతో సుహాసినిని రంగంలోకి దించారని అంటున్నారు. ముందుగా తన మీడియాకు ఈ లీకు ఇచ్చిన చంద్రబాబు నాయుడు దాన్ని నిజం చేశారంటున్నారు. శనివారం నాడు సుహాసిని నామినేషన్ వేసేందుకు రంగం అయ్యింది. అయితే తమ సోదరిని పోటీలో దించడం అన్నదమ్ములు కల్యాణ్ రాం - తారక రామారావులకు ఇష్టం లేదని అంటున్నారు. దీనికి కారణం కూడా సహేతుకంగానే చెబుతున్నారు. సమైక్య రాష్ట్రం కోసం తమ తండ్రి హరికృష్ణ ముందుగా రాజీనామా చేసినా చంద్రబాబు నాయుడు మాత్రం పట్టించుకోలేదని వారు ఆగ్రహంగా ఉన్నారట.
అలాగే గతంలో తమ తండ్రి హరికృష్ణ ను అనేక విధాలుగా అవమానించిన చంద్రబాబు నాయుడు ఆయన మరణం తర్వాత ఆ మచ్చను పోగొట్టుకుందుకు హడావుడి చేశారని ఆ ఇద్దరు అన్నదమ్ములు సన్నిహితుల వద్ద తమ ఆవేదన వ్యక్తం చేశారంటున్నారు. తమ ఇంటి నుంచి మరో ఇంటికి కోడలిగా వెళ్లిన తమ ఆడపడుచును నందమూరి ఇంటి వారసురాలిగా చేయడం వెనుక చంద్రబాబు నాయుడి కుట్రగా చెబుతున్నారు. మరోవైపు తమ తండ్రి మరణం తర్వాత తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించిన తీరు - ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు - ఆయన తనయుడు కె.తారక రామారావు తమను ఓదార్చిన తీరుకు ఆ అన్నదమ్ములిద్దరు ఫిదా అయ్యారంటున్నారు. దీంతో పాటు తమ తండ్రి హరికృష్ణ భౌతికకాయానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు కూడా చేయడం అన్నదమ్ములిద్దరికి ఎంతో ఆనందాన్ని కలిగించిందంటున్నారు. ఇంత ఆప్యాయంగా వ్యవహరించిన పార్టీకి వ్యతిరేకంగా తమ ఆడపడుచును బరిలో దించడం పట్ల వారిద్దరు వ్యతిరేకతను వ్యక్తం చేశారంటున్నారు. అయితే చంద్రబాబు నాయుడు తన చాణక్యంతో సుహాసిని మామగారైన చుండ్రు శ్రీహరితో మంత్రాంగం జరిపి ఎన్నికల బరిలో దించారని అంటున్నారు. మొత్తానికి రాజకీయాలలో నందమూరి వంశాన్ని ఎంత వాడుకోవాలో అంత వాడుకునే వరకూ చంద్రబాబు నాయుడు నిద్రపోరని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.