Begin typing your search above and press return to search.
ఎన్టీయార్ భారతదేశం...కేసీయార్ భారతం...?
By: Tupaki Desk | 27 April 2022 11:40 AM GMTతెలుగు రాజకీయ నాయకులకు జాతీయ రాజకీయాల మీద చాలా మోజు. ఒకసారి ముఖ్యమంత్రి కాగానే ఢిల్లీ వైపు చూసే వారే కనిపిస్తారు. ఆ దిశగా గట్టిగా ప్రయత్నాలు చేసి ఎంతో కొంత సక్సెస్ అయిన వారూ ఉన్నారు. వాటికి ఆద్యుడు, ఆరాధ్యుడు ఎన్టీయార్ అని కూడా ఇక్కడ ప్రస్థావించుకోవాలి. ఎన్టీయార్ కనీ వినీ ఎరగని మెజారిటీతో 1983లో ఉమ్మడి ఏపీలో ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు.
ఆ తరువాత ఎన్టీయార్ కి అర్ధమైంది ఏంటి అంటే ఇంకా అసలైన అధికారాలు రాష్ట్రాలకు లేవు అని, అంతా ఢిల్లీ పెత్తనమే సాగుతోందని. దాంతో ఎన్టీయార్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా మహానాడుని విజయవాడ వేదికగా నాడు నిర్వహించారు. దానికి జాతీయ స్థాయి నేతలు అందరినీ పిలిచి మరీ తాను జాతీయ నేతగా ఆవిష్కరింపచేసుకున్నారు.
ఇక నాటి నుంచి ఎన్టీయార్ జాతీయ రాజకీయల మీద ఆసక్తి చూపిస్తూనే ఉన్నారు. నిజానికి 1984లో ఎన్టీయార్ ముఖ్యమంత్రి పదవి పోవడానికి ఈ జాతీయ ఆసక్తి కూడా కేంద్రాన్ని కన్నెర్ర అయిందని చెబుతారు. ఆ తరువాత అదే జాతీయ నేతల మద్దతు కూడా ఎన్టీయార్ కి దక్కి ఆయన నెల తిరగకుండానే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. అలా కేంద్రం దాడిని ఎదుర్కొన్న తొలి విపక్ష రాజకీయ నేతగా చరిత్రలో నిలిచారు.
అది లగాయితూ ఎన్టీయార్ జాతీయ స్థాయిలో ఒక పార్టీ పెట్టాలని కలలు కనే వారు. దాని పేరు కూడా భారతదేశంగా నామకరణం చేశారు. అయితే ఎన్టీయార్ అనుకున్న భారత దేశం వీలుపడలేదు కానీ నేషనల్ ఫ్రంట్ మాత్రం సాకారం అయింది. దానికి చైర్మన్ గా ఎన్టీయార్ వ్యవహరించారు. అది 1989లో కాంగ్రెస్ ని కేంద్రంలో ఓడించి అధికారంలోకి వచ్చింది.
అలా ఎన్టీయార్ జాతీయ కలలు కొంత వరకూ తీరాయి. సీన్ కట్ చేస్తే ఇపుడు కేసీయార్ కూడా జాతీయ రాజకీయాల మీద మక్కువ కనబరుస్తున్నారు. ఆయన రెండు సార్లు తెలంగాణాకు సీఎం గా ఉన్నారు. ఇక రాష్ట్ర వైభోగం చాలు అనుకుంటున్నారు. జాతీయ రాజకీయాల్లో తన సత్తా చాటాలని చూస్తున్నారు.
నిజానికి 2019 ఎన్నికల వేళనే కేసీయార్ తన కోరికను బయటపెట్టుకున్నారు. కానీ మోడీ వేవ్ మళ్లీ బలంగా వీచడంతో ఆయన కేవలం సీఎం గానే మిగిలిపోయారు. ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు కూడా అర్ధాంతరంగా ఆగిపోయాయి. కానీ ఈసారి కేసీయార్ అసలు ఊరుకునేలా లేరు
ఆరు నూరు అయినా జాతీయ రాజకీయాల్లో అరంగేట్రం చేయడమే తన కర్తవ్యం అని ఆయన చెప్పకనే చెబుతున్నారు. ఇప్పటిదాకా తెలంగాణా రాష్ట్ర సమితిగా ఉన్న పార్టీని భారతీయ రాష్ట్ర సమితి షార్ట్ కట్ లో బీయారెస్ గా మార్చి దేశంలో కొత్త రాజకీయ పార్టీని తీసుకువస్తామని అంటున్నారు. బీయారెస్ పేరు క్యాచీగానే ఉంది. నాడు ఎన్టీయార్ భారతదేశం లాంటి సౌండ్ కూడా ఇందులో వినిపిస్తోంది.
కానీ జాతీయ రాజకీయ యవనిక మీద ఉమ్మడి ఏపీ సీఎం గా 42 సీట్లు కలిగిన బలమైన నేత ఎన్టీయార్ సరిగ్గా కుదురుకోలేకపోయారు. ఆయన కలలు అలాగే ఉండిపోయాయి. మరి రాజకీయ చతురుడు, వ్యూహకర్తగా పేరు గడించిన కేసీయార్ తన కోరికను తీర్చుకుంటారా. బీయారెస్ రెపరెపలు హస్తినలో రేపటి జాతీయ రాజకీయాన్ని మార్చేస్తాయా అన్నది చూడాలి. మొత్తానికి జై ఎత్తి జై కొట్టు తెలుగోడా. జాతీయ రాజకీయాల్లో ఘనమైన వాడా అని మరో మారు పాడాల్సి ఉంటుంది.