Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ శ‌త జ‌యంతి ఉత్స‌వాలు.. ఎక్క‌డ‌? మ‌రిచిపోయిన త‌మ్ముళ్లు..!

By:  Tupaki Desk   |   10 Oct 2022 2:30 PM GMT
ఎన్టీఆర్ శ‌త జ‌యంతి ఉత్స‌వాలు.. ఎక్క‌డ‌? మ‌రిచిపోయిన త‌మ్ముళ్లు..!
X
వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావాల‌ని అనుకుంటున్న టీడీపీ.. దానికి సంబంధించి చెప్పుకొన్న సంక ల్పాన్ని మ‌రిచిపోయిన‌ట్టుగా క‌నిపిస్తోందని పార్టీ అభిమానులు అంటున్నారు. ఈ ఏడాది మేలో నిర్వ‌హిం చిన మ‌హానాడులో టీడీపీ అధినేత చంద్ర‌బాబు గొప్ప సంక‌ల్ప‌మే చెప్పుకొన్నారు. "ప్ర‌స్తుతం పార్టీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు ఎన్టీఆర్ శ‌త జ‌యంతి ఉత్స‌వాల‌ను చేప‌డుతున్నాం. వ‌చ్చే ఏడాది వ‌ర‌కు ఊరూరా.. వాడ‌వాడా.. శ‌త జ‌యంతి వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించాలి" అని దిశానిర్దేశం చేశారు.

అంతేకాదు.. ఇలా ఎందుకు చేయాలో కూడా.. చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు. "ఎన్టీఆర్ తెలుగు ప్ర‌జ‌ల ఆత్మ గౌర‌వం కోసం.. పార్టీ పెట్టారు. ఇప్పుడు అది పోయింది. తెలుగు ప్ర‌జ‌లు ఇబ్బందుల్లో ఉన్నారు. సో.. ఇప్పుడు అన్న‌గారి స్ఫూర్తినిగ్రామ గ్రామానికి తీసుకువెళ్లాలి. ఆయ‌న స్ఫూర్తిని ర‌గిలించాలి. అంతేకాదు.. ఆయ‌న గౌర‌వాన్ని ప్ర‌జ‌ల్లో మ‌రింత ఇనుమ‌డింప‌జేసి.. పార్టీని అధికారంలోకి తీసుకువ‌చ్చేందుకు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేయాలి" అని పార్టీ నాయ‌కుల‌కు చంద్ర‌బాబు బోధించారు..

ఇంకే ముంది.. చంద్ర‌బాబు చేసిన దిశానిర్దేశంతో త‌మ్ముళ్లు క‌దిలారు. జూన్‌, జూలై వ‌రకు.. రాష్ట్రంలోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాలు, మండ‌ల కేంద్రాల్లో.. నాయ‌కులు ఎన్టీఆర్ శ‌త జ‌యంతి ఉత్స‌వాల పేరిట‌.. స‌భ లు నిర్వ‌హించారు. ఆయ‌నస్ఫూర్తిని వివ‌రించారు. అన్న‌దానాలు చేశారు. పేద‌ల‌కు చిన్న‌చిన్న కానుక‌లు కూడా అందించారు. మ‌ళ్లీ టీడీపీ ప్ర‌భుత్వం రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. చాటి చెప్పారు. దీనికి అను కూల మీడియాలో భారీ క‌వ‌రేజీ కూడా వ‌చ్చింది.

కొన్నాళ్ల‌పాటు.. ప్ర‌జ‌ల మ‌ధ్య ఎన్టీఆర్ పేరు మ‌ళ్లీ మార్మోగింది. గ‌త చంద్ర‌బాబు పాల‌న‌ను గుర్తు చేసుకు న్నారు. అయితే.. ఏమైందో.. ఏమో.. అలా మొద‌లైన శ‌త జ‌యంతి ఉత్స‌వాలు.. ఇలా ఆగిపోయాయి. ఇప్పు డు ఎక్క‌డా చ‌డీ చ‌ప్పుడు కూడా లేకుండా పోయింది. కొన్ని చోట్ల అన్న క్యాంటీన్ల‌ను అప్ప‌ట్లో తెరిచినా.. ఇప్పుడు మూత‌బ‌డ్డాయ‌నే వాద‌న వినిపిస్తోంది. అంటే.. ఈ స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లాల‌నే యోచ‌న త‌మ్ముళ్ల‌లో ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు.

అంతేకాదు.. అస‌లు ఎన్టీఆర్ శ‌త జ‌యంతి ఉత్స‌వాల‌ను కూడా మ‌చిరిపోయిన‌ట్టుగా ఉన్నారని అనిపిస్తోంద‌ని అభిమానులు అంటున్నారు. మ‌రి ఇలా అయితే.. ప్ర‌జ‌ల్లోకి ఎన్టీఆర్ స్ఫూర్తిని ఎవ‌రు తీసుకువెళ్తార‌నేది ప్ర‌శ్న‌. ఇప్ప‌టికైనా.. ఈ కార్య‌క్ర‌మాలు కొన‌సాగించాల‌ని సూచిస్తున్నారు. మ‌రి త‌మ్ముళ్లు ఏం చేస్తారో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.