Begin typing your search above and press return to search.
బాగా చెప్పావ్ ఎన్టీఆర్.. చంద్రబాబు కన్నీళ్లపై ప్రకాష్ రాజ్ కామెంట్
By: Tupaki Desk | 20 Nov 2021 1:35 PM GMTచంద్రబాబుకు జరిగిన అవమానంపై తాజాగా ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఒక వీడియో రిలీజ్ చేసి వైసీపీ నేతల అరాచకాన్ని ఖండించారు. ఆడపడుచుల గురించి పరుష పదజాలంతో మాట్లాడడం అరాచక పాలనకు నాందిగా పేర్కొన్నారు. అతి తప్పని స్పష్టం చేశారు. స్త్రీని గౌరవించడం మన సంస్కృతి అని.. మన సంప్రదాయం అని చెప్పుకొచ్చారు. తాను వ్యక్తిగత దూషణకు గురైన కుటుంబానికి చెందిన వ్యక్తిగా మాట్లాడడం లేదని.. ఒక కుమారుడిగా.. భర్తగా.. తండ్రిగా..భారతీయుడిగా మాట్లాడుతున్నానని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.
రాజకీయ నేతలు ఇలాంటివి ముగించాలని ఎన్టీఆర్ కోరారు. రాబోయే తరాలకు బంగారు బాట వేయాలని.. ఇలాంటివి ఇంతటితో ఆగిపోతాయని కోరుకుంటున్నట్టు జూ. ఎన్టీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే నందమూరి కుటుంబ సభ్యులు బాలకృష్ణ, రామకృష్ణతో సహా ఎన్టీఆర్ కుమార్తెలు సైతం ఈ అంశంపైన స్పందించారు. భువనేశ్వరిపైన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రామకృష్ణ కన్నీటి పర్యంతమయ్యారు.
చంద్రబాబు భార్య భువనేశ్వరిపై అసభ్యకరమైన వ్యాఖ్యలను ఖండిస్తూ జూనియర్ ఎన్టీఆర్ చేసిన ప్రకటనను విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ స్వాగతించారు.‘చాలా బాగా చెప్పావ్ డియర్’ అని రిప్లై ఇచ్చారు.
కాగా భువనేశ్వరిపై కామెంట్లు చేయడాన్ని ఇప్పటికే నందమూరి కుటుంబం అంతా ఖండించింది. ఈ ఘటన చాలా బాధాకరమంటూ హీరోలు కళ్యాణ్ రామ్, నారా రోహిత్ ట్వీట్లు చేసి ఎండగట్టారు.