Begin typing your search above and press return to search.
చంద్రబాబును భూస్థాపితం చేస్తా... ఎన్టీఆర్ అభిమాని హాట్ కామెంట్స్
By: Tupaki Desk | 9 April 2019 4:24 AM GMTఎన్టీఆర్‌ను కించపరిచే విధంగా మాట్లాడిన చంద్రబాబు నాయుడిని, రాజకీయంగా భూస్థాపితం చెయ్యటానికి ఎన్టీఆర్ అభిమానులు అందరూ తనతో కలిసి రావాలని గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి నాని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. పథకాలకు ఎన్టీఆర్ పేరు పెట్టుకునే చంద్రబాబు తెర వెనుక మాత్రం ఎన్టీఆర్ పట్ల దారుణంగా మాట్లాడుతున్నారని.. ఆ సంగతి రాధాకృష్ణ, చంద్రబాబుల సంభాషణల్లో బయటపడిందని అన్నారు.
ఎన్నికల ప్రచారం సందర్భంగా విలేకరులతో మాట్లాడిన ఆయన చంద్రబాబు, రాధాకృష్ణల మధ్య జరిగిన సంభాషణలను గుర్తు చేశారు. ఆ వీడియోతో వారి అసలు నైజం బయటపడిందని, ఆ సంభాషణల్లో ఎన్టీఆర్ గురించి చంద్రబాబు చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు తనను బాధించాయని కొడాలి అన్నారు. చంద్రబాబు గురించి ఎన్టీఆర్ అభిమానిగా ముందు నుంచి చెబుతున్నానని, ఉచ్ఛం, నీచం లేనటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడని శాపనార్ధాలు పెట్టారు.
ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని కొట్టేసి, ఆయన పదవిని కూడా లాక్కుని మరణానికి కారణమైన నీచాతినీచుడు చంద్రబాబు అని విమర్శించారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నాలుగు గోడల మధ్య ఎన్టీఆర్ గురించి మాట్లాడే భాషేనా అది...బయటకు వచ్చి ప్రజలు రాళ్లతో కొడతారేమోనని ఆయన విగ్రహాలకి దండలు వెయ్యటం, పథకాలకి పేరు పెట్టినట్లు నటించడం చంద్రబాబు నాయుడికి అలవాటేనని అన్నారు.బాబు ఎన్టీఆర్ పాలిట దుర్మార్గుడని, రాష్ట్రానికి పట్టిన శని అని దుయ్యబట్టారు. వైఎస్ జగన్ నాయకత్వంలో వచ్చే ఎన్నికల్లో ప్రజలు, చంద్రబాబును ఇంటికి సాగనంపుతారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు మాటలు విన్నాక కూడా ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబు వెంట ఉంటే ఆయన ఆత్మక్షోబిస్తుందని చెప్పారు. ఎన్టీఆర్ అభిమానులు అంతా చంద్రబాబును ఓడించాలని పిలుపునిచ్చారు.