Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ ను ప్రచారానికి రావొద్దంటున్న అభిమానులు!
By: Tupaki Desk | 22 Nov 2018 9:19 AM GMTతెలంగాణ ముందస్తు ఎన్నికల ప్రచార బరిలో జూనియర్ ఎన్టీఆర్ దూకుతారా? లేదా? కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థిగా నందమూరి సుహాసిని పేరు ఖరారైనప్పటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ విషయంపై చర్చ జరుగుతోంది. వస్తారని కొందరు ప్రచారం చేస్తుండగా, ఆయన రారని మరికొందరు విశ్లేషిస్తున్నారు. తాజాగా ఈ విషయంపై క్లారిటీ వచ్చేసినట్లే కనిపిస్తోంది.
జూనియర్ ఎన్టీఆర్ - కల్యాణ్ రామ్ లకు చెప్పకుండానే వారి సోదరి సుహాసినిని టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల్లో నిలబెట్టారని తొలుత వార్తలొచ్చాయి. ఆమె పోటీ సోదరులకు ఇష్టం లేదని.. ఎన్నికల ప్రచారానికి వారు దూరంగా ఉంటారని కూడా వాదనలు వినిపించాయి. అయితే - అవన్నీ వదంతులేనని ఇద్దరు అన్నదమ్ములు తమ ట్వీట్లతో స్పష్టం చేశారు. సోదరికి తమ మద్దతు ప్రకటించారు. ఎన్నికల ప్రచారానికి వస్తారా? లేదా? అనే సంగతిని మాత్రం బయటపెట్టలేదు.
ప్రచారానికి రావాలంటూ పార్టీ నేతల నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో ఎన్టీఆర్ ఇటీవల తన సన్నిహితులు - కొద్దిమంది అభిమానులను సంప్రదించారట. తాను ప్రచారం చేయాలా? వద్దా? అని వారి నుంచి అభిప్రాయాలు కోరారట. చివరకు మెజారిటీ వ్యక్తుల అభిప్రాయం చూసి షాకయ్యారట. ప్రచారానికి వెళ్లకపోవడమే మంచిదని వారంతా సూచించారట.
ఎన్టీఆర్ సన్నిహితులు - అభిమానులు ఆయన ప్రచారానికి నో చెప్పడానికి ప్రధానంగా రెండు కారణాలున్నట్లు తెలుస్తోంది. అందులో మొదటిది.. నందమూరి వారసురాలిగా సుహాసిని పేరుంది. కూకట్ పల్లిలో టీడీపీకి మంచి పట్టుంది. కార్యకర్తల అండ ఉంది. ఎన్టీఆర్ ప్రచారం చేసినా - చేయకపోయినా సుహాసిని గెలుపు ఖాయమే. కాబట్టి ఆయన ప్రచారానికి వెళ్లనక్కర్లేదు. ఇక రెండోది.. ఎన్టీఆర్ తన అక్క కోసం ప్రచారానికి వెళ్తే.. టీడీపీ తరఫున పోటీ చేస్తున్న ఇతర అభ్యర్థులు కూడా తమ తరఫున ప్రచారం చేయాలంటూ ఆయనపై ఒత్తిడి పెంచుతారు. వారి తరఫున కూడా వెళ్తే టీఆర్ ఎస్ పై విమర్శలు చేయాల్సి వస్తుంది. తండ్రి హరికృష్ణ మరణించినప్పుడు తమకు అండగా నిలిచిన కేసీఆర్ కుటుంబంతో ఇలా వైరం పెంచుకోవడం సముచితం కాదు. కాబట్టి ప్రచారానికి వెళ్లకుండా ఉంటేనే మేలని వారంతా దాదాపు మూకుమ్మడిగా ఎన్టీఆర్ కు సలహా ఇచ్చారట. దీంతో వారి అభిప్రాయాలను గౌరవిస్తూ.. ప్రచారానికి దూరంగా ఉండాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.