Begin typing your search above and press return to search.
కుప్పంలో జూనియర్ అభిమానుల లెటర్ కలకలం ?
By: Tupaki Desk | 15 Nov 2021 5:04 AM GMTజూనియర్ ఎన్టీయార్ లేఖంటు కుప్పం మునిసిపాలిటి పరిధిలో వైరల్ అయిన లేఖ నిజమే అయితే తెలుగు దేశం పార్టీ సంగతి అంతే సంగతులు. మునిసిపల్ ఎన్నికలకు సరిగ్గా 24 గంటల ముందు రోజునుండి జూనియర్ ఎన్టీ యార్ లేఖంటు ఒకటి వైరల్ అయ్యింది. దాంతో టీడీపీ నేతలకు ఒక్కసారిగా షాక్ కొట్టినట్లయ్యింది. సదరు లేఖ లో ఎట్టి పరిస్ధితుల్లోను మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ కి ఓటు వేయద్దంటు అప్పీలుంది.
‘కుప్పం మునిసి పాలిటి పరిధి లో జరిగే ఎన్నికల్లో ఆత్మాభిమానం కలిగిన అభిమానులుగా మా అన్న జూనియర్ ఎన్టీ యార్ అభిమానులు గా ఓ విన్నపం. గత 2 సంవత్సరాలు గా కుప్పం గడ్డ మీద అన్న ఎన్టీయార్ పేరు ఎత్త కుండా, ఫ్లెక్సీలు కట్టకుండా మా పై ఉక్కు పాదం మోపిన వ్యక్తి ఈరోజు టీడీపీ తరపున మున్సిపల్ ఛైర్మన్ గా పోటీ చేస్తున్నాడు. మన అన్న జూనియర్ ఎన్టీయార్ పేరు వినిపించకుండా 2 సార్లు మనపై దాడిచేయించాడు’.
టీడీపీ చేతిలో గాయ పడ్డ ప్రతి జూనియర్ ఎన్టీ యార్ అభిమాని కి ఇపుడు సమయం వచ్చిందని లేఖ లో స్పష్టంగా ఉంది. లోకేష్ ప్రచారం కోసం పర్యటించిన ప్రతి వార్డు లోను టీడీపీని దెబ్బ తీయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. జూనియర్ ఎన్టీ యార్ అభిమానులకు ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చిందని లేఖలో ఉంది. ఎన్టీ యార్ అభిమాని అనేవాడు దెబ్బ తినటమే కాదు సమయం వచ్చినపుడు దెబ్బ తీయగలడన్న విషయాన్ని కూడా చూపించాలని లేఖ లో ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
ఎన్టీ యార్ ఫ్యాన్స్ ఓపెన్ లెటర్ పేరుతో కుప్పంలోని జూనియర్ ఎన్టీయార్ అభిమానుల తరపున ఓటర్లకు బహి రంగంగా రాసిన లేఖ ఇపుడు కుప్పం లో వైరల్ అయ్యింది. లేఖ లో అభిమానులు అని ఉందే కానీ ఎవరి పేరు లేదు. దాంతో వైరల్ అయిన లేఖ కు జూనియర్ మద్దతు ఉందా లేదా అన్న విషయంలో స్పష్టత లేదు. నిజం గానే జూనియర్ అభిమానులు రాసిన లేఖేనా లేకపోతే ఆ పేరు తో వైసీపీ నేతలు కానీ లేదా ఇంకెవ రైనా సర్క్యులేట్ చేస్తున్నారా అన్నదే తేలలేదు.